Begin typing your search above and press return to search.
జగన్ ఇంటి బాత్రూమ్ తో పనేంటి తమ్ముళ్ళూ...?
By: Tupaki Desk | 10 March 2022 11:30 AM GMTవైఎస్ జగన్ వర్సెస్ టీడీపీ రచ్చ అన్నది అసెంబ్లీ లోపలా బయటా కూడా ఎపుడూ సాగుతూనే ఉంటుంది. ఇక జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా టీడీపీ మార్క్ హాట్ కామెంట్స్ ఉంటూనే ఉంటాయి. అలా ఏపీలో ముప్పయి లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం తలపెట్టి అమలు చేస్తఒంది.
దీని మీద అసెంబ్లీలో జరిగిన చర్చలో సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇన్ని లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ఒకేసారి చేపట్టడం అన్నది చరిత్రలో ఎన్నడూ జరగలేదని అన్నారు. అంతేకాదు, ప్రపంచంలో కూడా ఇది ఒక రికార్డు అనేశారు. ఆఖరుకు పేదల కోసం పరితపించే కమ్యూనిస్టు దేశాలలో కూడా ఇన్ని లక్షల ఇళ్ళు కట్టారని తాను అనుకోను అని కూడా అన్నారు.
ఇక టీడీపీ మీద కూడా అంబటి మార్క్ పంచులు వేశారు. ఏపీలో పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణం జరుగుతూంటే వాటికి వంకలు పెట్టి విమర్శలు చేయడం టీడీపీ తమ్ముళ్లకే చెల్లింది అని అన్నారు. జగన్ ఇంట్లో బాత్ రూమ్ల సాటి కూడా చేయని ఇళ్ళు కడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.
జగన్ గారి ఇంటి బాత్ రూమ్ ని టీడీపీ తమ్ముళ్ళు ఎపుడు చూశారు అని ఆయన ప్రశ్నించారు. అసలు ఆ పోలిక ఎలా వచ్చిందని కూడా నిలదీశారు. టీడీపీ హయాంలో ఇన్నేసి ఇళ్ళు ఎపుడైనా కట్టారా అని కూడా గద్దించారు. ఎన్టీయార్ పేదలకు పక్కా ఇళ్ళు అని పధకం ప్రవేశపెట్టారని, మరి ఆ మహానుభావుడు తెచ్చిన స్కీమ్ ని కూడా పద్నాలుగేళ్ల పాటు సీఎం గా ఉన్న చంద్రబాబు సరిగ్గా అమలు చేయలేదని అన్నారు.
తాను 1989 నుంచి 1994లో వరకూ ఎమ్మెల్యేగా ఉంటే నాడు ప్రతీ నియోజకవర్గానికి కోటా మాదిరిగా పదుల సంఖ్యలో ఇళ్ళు మంజూరు అయ్యేవని ఆయన గుర్తు చేసుకున్నారు. నాడు ఇళ్ల కోసం జనాలు పెద్ద ఎత్తున క్యూ కట్టిన దాఖలాలు ఉన్నాయని చెప్పారు. అలాంటిది ఇపుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉంటే చాలు ఇల్లు ఇస్తున్న జగన్ సర్కార్ మీద బురద జల్లడం టీడీపీకి భావ్యమా అని ఆయన ప్రశ్నించారు.
మొత్తానికి జగన్ ఇంటి బాత్ రూమ్ ఎపుడు చూశారు అంటూ టోటల్ గా తనదైన శైలిలో అంబటి విపక్షం మీద విరుచుకుపడ్డారు. ఆయన మొత్తం స్పీచ్ లో హైలెట్ ఏంటి అంటే జగన్ గారి ఇంటి బాత్ రూమే. దీంతో సభలో నవ్వులు విసిరాయి.