Begin typing your search above and press return to search.

ఆ నలుగురికీ గ్యారంటీ ఇచ్చేశారా... ?

By:  Tupaki Desk   |   13 March 2022 2:30 AM GMT
ఆ నలుగురికీ గ్యారంటీ ఇచ్చేశారా... ?
X
జగన్ మంత్రి వర్గ విస్తరణ మీద ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తం ఇరవై ఆరు మంది మంత్రులలో ఎందరు ఉంటారు, ఎందరు మాజీలు అవుతారు అన్నదాని మీద ఎవరికి తోచిన లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇక జగన్ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పిన సందర్భంగా కొందరిని కంటిన్యూ చేస్తామని కూడా పేర్కొన్నారు.

అలా కంటిన్యూ అయ్యే వారిలో నలుగురు గ్యారంటీ అన్న వార్త వినవస్తోంది. వారు ఎవరంటే ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన మరో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక క్రిష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నానీలు మంత్రులుగా కొనసాగుతారు అని అంటున్నారు. పేని నాని బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. నోరున్న పేరున్న మంత్రి.

పైగా జగన్ కి వీరవిధేయుడు. కోస్తాలో రాజకీయ సామాజిక సమీకరణను దృష్టిలో ఉంచుకుని ఆయన్ని కొనసాగిస్తారు అని అంటున్నారు. ఇక మరో మంత్రిగా కొడాలి నాని పేరు కూడా ఉంది. ఆయన కూడా కోస్తాలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా డిపెండ్ చేయగలిగిన సత్తా ఉన్నా వారు. పైగా ఆయనకు రీప్లెస్ మెంట్ లేదు అని అంటున్నారు.

ఇదే తీరున ఉత్తరాంధ్రా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలను ప్రభావితం చేసే పెద్ద తలకాయగా ఉన్న బీసీ కాపు అయిన బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉండాల్సిందే అంటున్నారు.

ఇక ఎన్నికల ట్రబుల్ షూటర్ గా జగన్ మంత్రివర్గంలో పేరు పొందిన వారు, జగన్ కి అత్యంత సన్నిహితుడు, రాయ్లసీమలో పెద్ద దిక్కు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగడం కూడా అవసరం అని అంటున్నారు.

ఈ నలుగురినీ కొనసాగిస్తూ మిగిలిన వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ సీనియర్లతో పాటు వచ్చే వారు అంతా కొత్త వారు, యువకులే మంత్రులుగా ఉంటారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.