Begin typing your search above and press return to search.
వైసీపీ సోషల్ వర్సెస్ వైసీపీ డిజిటల్ మీడియా మధ్య బిగ్ ఫైట్!
By: Tupaki Desk | 9 March 2022 4:10 AM GMTఒకే పార్టీ.. రెండు విభాగాలు. ఎలా ఉండాలి? ఎలా పనిచేయాలి? కలిసి కట్టుగా ముందుకు సాగాలని.. సాగుతాయని.. ఎవరైనా అనుకుంటారు. కానీ.. అది ఎక్కడైనా ఏమో కానీ.. ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాత్రం కాదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వైసీపీలోని రెండు ప్రధాన మీడియా విభాగాల మధ్య పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఆదిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. అవే.. వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ డిజిటల్ మీడియాలు! ఈ రెండు మీడియాలు వైసీపీకి అత్యంత కీలకం. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి.
అయితే.. 2019 ఎన్నికలకు ముందు.. అంటే 2016,2017 మధ్యలో వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న సాబుల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం చేసినంత పని అయ్యింది. అయితే.. అప్పట్లో వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకుని.. ఇరు పక్షాలను చల్లబరిచింది. అయితే.. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ ఫుల్ జోష్ వచ్చి.. జగన్‌ను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో కలిసి పనిచేశారు. నిజానికి ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, బాబు తనయుడు లోకేష్ మీద, టీడీపీ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద.. మీమ్స్ మీద మీమ్స్ చేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
అంతిమంగా ఇది.. జగన్ గెలుపునకు.. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతగానో దోహదపడింది. అయితే.. ఈ రెండు సోషల్ మీడియాను ఎక్కువగా యూత్ ఫాలో అయ్యారు. వారే పార్టీకి బలంగా కూడా మారారు. గత ఎన్నికల్లో వీరి ఓట్లతోనే వైసీపీ విజయం దక్కించుకుంది. అయితే.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తియినా ఇప్పటి వరకు యువతకు ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా? చేస్తుందా? అని ఎదురు చూశారు. కానీ. ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. దీంతో ఇదే యూత్ ఇప్పుడు.. వైసీపీ సోషల్ మీడియాను ``రొచ్చు`` అనేలా మాట్లాడి వాళ్లను గాయపరిచారు. అయినా కూడా వెయిట్ చేశారు.
అయితే.. ఇంకా ఎదురు చూసే పరిస్థితి కనిపించడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు.. ప్రభుత్వంలో ఉన్న డిజిటల్ మీడియాను అసలు పట్టించుకోవడం లేదు. ఇదిలావుంటే.. ఇదే విషయంపై వైసీపీ డిజిటల్ మీడియా హెడ్ ఒకరు అక్కడే(విజయవాడ) ఉన్న ఒక హోటల్‌లో కూర్చొని వైసీపీ సోషల్ మీడియాను అవహేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని డిజిటల్ మీడియా హెడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు వైసీపీలోనే చర్చ సాగుతోంది. అంతేకాదు.. డిజిటల్ మీడియా హెడ్‌గా ఉన్న వ్యక్తి.. గతంలో వేరే పార్టీకి సాయం చేశాడంటూ.. ఫొటోలపై ఫొటోలు పెడుతూ.. ఆయనను టార్గెట్ చేస్తున్నారు.
దీంతో వైసీపీ డిజిటల్ మీడియా, సోషల్ మీడియాల మధ్య తీవ్రస్థాయిలో పోరు సాగుతోంది. ప్రస్తుతం ఇది సైలెంట్ వార్‌గా జోరుగా సాగుతున్నా.. ఈ విషయం.. పార్టీ అధిష్టానానికి తెలిసినా.. ఏమీ చేయకుండా చోద్యం చూస్తోందని.. వైసీపీ సోషల్ మీడియా వాళ్లు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పటికైనా.. పార్టీ అధిష్టానం పట్టించుకుంటుందో చూడాలి.
ఎందుకంటే.. టీడీపీ సోషల్ మీడియా పరుగులు పెడుతోంది. ఐటీడీపీ పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా యూత్ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తరఫున డిజిటల్ మీడియా దూకుడు తగ్గిపోతే.. అది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.