Begin typing your search above and press return to search.
వైసీపీలో జంపింగ్ జఫాంగులు....లిస్ట్ పెద్దదేనా... ?
By: Tupaki Desk | 13 March 2022 8:52 AM GMTవైసీపీలో జంపింగ్ జఫాంగులు ఉన్నారా అన్నదే ఇపుడు అతి పెద్ద చర్చ. ఉన్నారా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు అంటున్నారు. ఎందుకంటే ఇది రాజకీయం. అటు నుంచి ఇటు వైపు వచ్చిన వారు ఇటు నుంచి ఎటు వైపు అయినా వెళ్లగలరు. ఇది సింపుల్ లాజిక్. అలాంటపుడు వారంతా తమతోనే ఎల్లకాలం ఉంటారని, ఉండాలని భావించడం కూడా అత్యాశే అవుతుంది.
ఇదిలా ఉంటే మూడేళ్ల వైసీపీ ఏలుబడిలో సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు అన్నది జనాంతికంగా వినిపించే మాట. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా హై కమాండ్ కి ఎమ్మెల్యేలకు మధ్య పెద్ద గ్యాప్ అయితే ఉంది. తాము కలవాలనుకున్నా సీఎం ని కలిసే సీన్ లేదని వారంతా మధనపడుతూనే కాలం గడిపేశారు. ఇక వచ్చేవి ఎన్నికల సీజన్.
దాంతో కాస్తా ధైర్యం ఎవరికైనా వస్తుంది. మెజారిటీ కాలం పూర్తి అయినందువల్ల ఎవరైనా జూలు విదిలించే సీన్ ఉంటుంది. మరో వైపు ఆశలు అవకాశాలకు ఇపుడు టెస్టింగ్ టైమ్. మంత్రి పదవులు వస్తాయా రావా అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. ఒకవేళ వస్తే లక్కే తప్ప చిక్కే లేదు, అలా కాకుండా ఉంటే ఏం చేయాలి అంటే తమ రూటే సెపరేట్ అని ఎవరికి వారు వేరే దారి వెతుక్కోవడమే.
ఇది ఆశావహులలో చాలా మంది అనుకుంటున్నదని ప్రచారం సాగుతోంది. మరో వైపు వందకు పైగా ఎమ్మెల్యేలు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఈసారి వారిలో సగానికి సగానికి టికెట్లు దక్కే సీన్ లేదని అంటున్నారు. అలాంటి వారు కూడా తమ రాజకీయ మనుగడ కోసం వేరే దారి చూసుకుంటారు అని అంటున్నారు. ఇంకో వైపు మంత్రి పదవులో మూడేళ్ళుగా కొనసాగుతున్న అమాత్యులను తప్పిస్తే వారిలో ఎంత లేదన్నా అసంతృప్తి వెల్లువలా బయటకు వస్తుందని అంటున్నారు.
దాంతో వారిని బుజ్జగించడానికి అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ భేటీలో చెప్పిన మాటలు ఎంతవరకూ పనిచేస్తాయి అన్నది కూడా చూడాలి. పార్టీని పటిష్టం చేయండి, మళ్లీ వైసీపీ గెలిస్తే మీరే మంత్రులు అని జగన్ చెబుతున్న మాటలు ఎంతమందికి స్వాంతన కలిగిస్తాయి అన్నది కూడా చూడాలి. ఇక్కడ ఒకటి నిజం. ఒకసారి కుర్చీ దిగేశాక మళ్ళీ దాన్ని పట్టుకోవడం అంటే చాలా కష్టం.
మరి ఈ సంగతి తెలిసిన వారు అంతా రానున్న రోజుల్లో జంపింగ్ జఫాంగులు గా మారితే పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే సాగుతోంది. ఉత్తరాంధ్రా జిల్లాల్లోని ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఒక ప్రస్తుత మంత్రి తో పాటు, నెల్లూరు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు కూడా తమ ఆశలు తీరకపోతే టీడీపీ వైపు చూసే అవకాశం ఉందని ప్రచారం అయితే గట్టిగా ఉంది.
మరి ఈ మ్యాటర్ అధినాయకత్వం వద్ద కూడా ఉందని, అందుకే వారిని పార్టీ గొప్పది, దానికోసం పనిచేయాలని సూచిస్తున్నారు అంటున్నారు. జంపింగ్ జఫాంగులు లిస్ట్ చూస్తే పెద్దదిగానే ఉంది. వైసీపీ వీరిని ఎలా అదుపులో ఉంచుకుంటుందో చూడాల్సిందే.