Begin typing your search above and press return to search.
మంత్రిగా అన్ ఫిట్... అక్కడ మాత్రం హిట్... ?
By: Tupaki Desk | 13 March 2022 8:53 AM GMTమంత్రుల ఎంపిక అన్నది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టం. ఆయనకు నచ్చిన వారే మంత్రులుగా కొలువు తీరుతారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అయితే మంత్రులను ఎంపిక చేయడానికి తొలగించడానికి సమర్ధత, పనితీరు ఇవే ప్రమాణాలుగా ఎవరైనా చూస్తారు. మంత్రులను తప్పిస్తున్నారు అంటే జనంలో కానీ ఎవరికైనా కానీ కలిగే ఒకే ఒక అభిప్రాయం వారు సమర్ధులు కారనే. మరి విసీపీ అధినాయకత్వం మాత్రం మంత్రులుగా వద్దు అనుకుంటున్న వారికి ఇంకా పెద్ద బాధ్యతలను అప్పగించడానికి సిద్ధపడతామంటోంది.
నిజానికి మంత్రిగా ఉన్న వారికి సలహాలు చెప్పేందుకు ఉన్నత స్థాయి అధికారులు ఉంటారు. వారి సాయంతో చక్కగానే తమ విధులను నిర్వహించవచ్చు. అదే పార్టీ బాధ్యతలు చూడడం అంటే చాలా కష్టమైన విషయం. అక్కడ అంతా తానై నడిపించాలి. అంతే కాదు అందరినీ కో ఆర్డినేట్ చేసుకోవాలి. ఇక ప్రత్యర్ధుల ఎత్తులను గమనించి ఎప్పటికపుడు కొత్త వ్యూహాలను రూపొందించుకోవాలి. పైగా ఎన్నికల వేళ ఒక రకంగా యుద్ధమే చేయాలి.
ఇలా చాలానే చేయాలి. మరి మంత్రిగా బాధ్యతల నిర్వహణలో అని ఫిట్ అని భావించిన వారిని తీసుకువచ్చి జిల్లా ప్రెసిడెంట్లు చేస్తే మిగిలిన వారు వారి మాట వింటారా అన్నది ఒక పెద్ద చర్చ. అదే టైమ్ లో ఆ జిల్లాలో మరొకరికి మంత్రి పదవి ఇస్తారు. ఆయన కూడా పార్టీ మాట వినేలా చూసుకోవాలి. మరి కొత్త మంత్రి, మాజీ మంత్రుల మధ్య మంచి రిలేషన్స్ ఉండమన్నా ఉంటాయా.
తన పదవి పోయిందని మాజీలు రగిలిపోతే కొత్త వారు తమకు చాన్స్ వచ్చింది అంటే తన సమర్ధతే కారణం అని భావిస్తారు. ఇలా వర్గాలు, గ్రూపులు మరింత పెరిగే విధంగానే వైసీపీ కొత్త విధానం ఉండే అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు. గతంలో అయితే మంత్రులుగా తప్పించిన వారిని పక్కన పెట్టేసేవారు.
కానీ వారినే ముందు పెట్టి పార్టీని నడిపించమంటే వినే వారు ఎవరుంటారు అన్నదే చర్చ. ఇక వైసీపీ హై కమాండ్ తాను ఇచ్చిన మాట ప్రకారం రెండున్నరేళ్ళ తరువాత విస్తరణ చేపడతామని అంటోంది. అందువల్ల సమర్ధులుగా మంత్రులు పనిచెసినా కూడా తప్పించడం అనివార్యమని చెబుతోంది. అయితే జనాలకు కానీ పార్టీ జనాలకు కానీ మెసేజ్ ఆ విధంగా వెళ్తుందా అన్నది కూడా సందేహమే.
ఇక వైసీపీలో ఉన్న 24 మంది మంత్రులలో పనితీరు బాగులేని వారు కూడా ఉన్నారు. అందరికీ ఒకే గాటకు కట్టేసి సమర్ధులను కూడా తీసేస్తే మంచిగా పనిచేసిన వారికి కూడా నామర్దాగా ఉండదా అన్న బాధ అయితే ఉందిట. మొత్తానికి చూస్తే మాజీ మంత్రులు పార్టీకి, కొత్త వారు మినిస్టర్ కుర్చీలకు అన్న వైసీపీ కాన్సెప్ట్ లో ఎక్కడో తేడా కొడుతోందని చర్చ అయితే సాగుతోంది. మరి దీని మీద గట్టిగా కసరత్తు చేయకుండా ఇదే ప్లాన్ అమలుచేసుకుంటూ పోతే మాత్రం ఇపుడు జిల్లాలలో ఉన్న గ్రూపులకు అదనంగా మరిన్ని గ్రూపులు వైసీపీలో వచ్చి చేరుతాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.