Begin typing your search above and press return to search.
ఏపీ సర్కారు పనితనంపై ఆగ్రహం.. పోలవరం పాపం మీదేనంటే ఘాటు లేఖ
By: Tupaki Desk | 10 Aug 2022 10:30 AM GMTమా జగన్ అంత.. మా జగన్ ఇంత అంటూ నిత్యం భజన చేసే ఏపీ అధికార పార్టీ నేతలకు.. తమ అధినేత నడిపిస్తున్న ప్రభుత్వం డెవలప్ మెంట్ లో దూసు కెళుతోందని.. వేలెత్తి వంక పెట్టటానికి సాధ్యం కాని రీతిలో ఆయన పాలన సాగిస్తున్నట్లుగా కీర్తిస్తుంటారు. ఆయన పని తీరుపై తాజాగా పోలవరం అథారిటీ ఘాటు లేఖ రాయటం షాకింగ్ గా మారింది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి రాష్ట్రమే కారణమని.. జగన్ ప్రభుత్వం పుణ్యమేనని తేల్చేసిన కేంద్రం తీరు ఏపీలోని ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పక తప్పదు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం కావటానికి ఏపీ జలవనరుల శాఖే కారణంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసింది. కాంట్రాక్టు తీసుకున్న సంస్థ.. రాష్ట్ర జలవనరుల శాఖ సరైన ప్రణాళికను అమలు చేయకపోవటమే ప్రాజెక్టునిర్మాణంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లుగా తేల్చేసింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణకు ఒక యాజమాన్య విభాగం ఏర్పాటు చేయాలని మూడేళ్ల నుంచి చెబుతున్నామని కానీ రాష్ట్ర జలవనరుల శాఖ మాత్రం పట్టించుకోవటం లేదని ఆక్షింతలు వేసింది.
తాజాగా గోదావరి వరదల్లో దిగువ కాఫర్ డ్యాం మీదుగా వరదనీరు పోటెత్తి ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తటానికి కారణం ప్రాజెక్టు నిర్మాణ పనులు నెమ్మదిగా జరగటమే కారణంగా స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రాసిన లేఖ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టును 2024 జూన్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరగటం లేదని స్పష్టం చేయటంతో పాటు..ఏపీ ప్రభుత్వ వైఫల్యాన్ని సూటిగా చూపించినట్లుగా చెబుతున్నారు.
షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఇప్పటికే నెలల తరబడి ఆలస్యంగా ఉన్నారని.. చాలా నెమ్మదిగా పనులు జరుగుతున్నట్లుగా తప్పుపట్టింది. ఇలాంటి ఆలస్యాలు ప్రాజెక్టు పురోగతికి తోడ్పడవని చెబుతూ.. ప్రస్తుత పరిణామాలతో తలెత్తే అన్ని ఇతర పరిణామాలు ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత ఆలస్యం చేస్తాయని స్పష్టం చేసింది.
రాష్ట్ర జలనవరుల శాఖ తో పాటు ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్థల వైఫల్యమే దీనికి కారణంగా తేల్చింది. తాజా పరిణామం ఏపీలోని జగన్ ప్రభుత్వ పని తీరు ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ తీరు కచ్ఛితంగా జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికి గురి చేస్తుందన్న మాట వినిపిస్తోంది.