Begin typing your search above and press return to search.

షాకిచ్చేలా తాజా అధ్యయనం.. మగాళ్లకు ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఇంకేం ఉంటుంది?

By:  Tupaki Desk   |   4 March 2022 2:30 AM GMT
షాకిచ్చేలా తాజా అధ్యయనం.. మగాళ్లకు ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఇంకేం ఉంటుంది?
X
సరికొత్త రిపోర్టులోని అంశాలు మగాళ్లకు కరెంటు షాక్ కొట్టేలా మారాయి. రోజులు మారే కొద్దీ మగాళ్ల ‘సామర్థ్యం’ లెక్కను చెప్పి దిమ్మ తిరిగేలా చేసింది. ఒకప్పుడు మన తాతలకు అరవై ఏళ్ల వయసులో ఎంతటి శృంగార .. సంతానోత్పత్తి సామర్థ్యం ఉందో.. ఇప్పటి యువకుల్లో అంతే ఉందట. ఈ లెక్కన మన తాతలు మాంచి యవ్వనంలో ఉన్నప్పుడు వారిలోని సామర్థ్యానికి ఇప్పటి మగాళ్లు ఎంత దూరంగా ఉన్నారన్న విషయాన్ని చెప్పే ఈ నివేదిక భారీ బ్యాడ్ న్యూస్ ను చెప్పిందని చెప్పాలి.

టెక్నాలజీ పెద్దగా లేని వేళలో.. మగాళ్ళ సెక్సు సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉండేదన్న విషయం.. తగ్గిపోయిన ఇప్పటి మగాళ్లతో పోల్చి చూసినప్పుడు ఇట్టే అర్థమైపోతుంది. అప్పట్లో ఒకసారి శృంగారంలో పాల్గొంటే తప్పకుండా ప్రెగ్నెన్నీ వచ్చేదట. కానీ.. ఇప్పటి మగాళ్లు ఎన్నిసార్లు చేసినా ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి నెలకొందట. ఒక ఉద్యమం మాదిరి సెక్సు చేస్తే కానీ పిల్లలు పుట్టని జంటలు మన దగ్గర చాలానే కనిపిస్తూ ఉంటాయి. దీనికి లోపం మీదంటే మీదనే మాటను పక్కన పెడితే.. తాజా అధ్యయనం చెబుతున్నదేమంటే.. పురుషుల్లో సంతాన సాఫల్యం స్థాయి బాగా పడిపోయినట్లు చెబుతున్నారు.

గడిచిన 40 ఏళ్లలో పురుషుల సంతానోత్పత్తి 60 శాతం వరకు తగ్గినట్లుగా యూకేకు చెందిన హెల్త్ మ్యాగజైన్ ‘మెన్స్ ఫిట్ నెస్’ వెల్లడించింది. 30 ఏళ్ల క్రితం ఈ సంస్థ జరిపిన అధ్యయనంలో 60 ఏళ్ల వ్యవధిలో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం తగ్గిందని.. దీని ప్రకారం చూస్తే.. ఇప్పటి పురుషులు ఎంతటి ప్రమాదంలో ఉన్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఆ తర్వాత 2011, 2017లో జరిపిన అధ్యయనాలు సైతం ఇదే విషయాల్ని వెల్లడిస్తున్నాయి.

అమెరికాకు చెందిన మేయో క్లినిక్ అంచనా ప్రకారం ప్రతి ఏడు జంటల్లో ఒక జంట సంతాన సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొన్నారు. ఏడాది పాటు కండోమ్ తో సహా ఎలాంటి సురక్షిత పద్దతుల్నిపాటించకుండా సెక్సు చేసినా కూడా సంతానం కలగటం లేదని పేర్కొంది. పురుషుల్లో సంతానలేమికి కారణాలు చూస్తే.. జీవనశైలి.. అనారోగ్యం.. చెడు అలవాట్లు.. ఫిట్ నెస్ లేకపోవటం.. ఒత్తిడి.. ఫాస్ట్ ఫుడ్.. లైంగిక శక్తిని అందించే ఆహారాన్ని తీసుకోకపోవటం లాంటివెన్నో కారణాలు ఉన్నాయి. సంతానోత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటన్నది చూస్తే..

- వేడి ప్రదేశాల్లో జీవించే వారు హాట్ టబ్ లు.. ఆవిరి స్నానం.. వేడినీళ్ల స్నానం లాంటివి తగ్గించాలి.

- పురుషులు ధరించే ఇన్నర్స్ నుంచి ఫ్యాంట్ల వరకు వదులుగా.. గాలి ఆడేలా ఉండే దుస్తుల్ని ధరించాలి.

- కాటన్ తో తయారు చేసిన వస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. టైట్ గా ఉండే దుస్తులతో వృషణాలలో ఏర్పడే వేడి బయటకు వెళ్లకుండా చేస్తుంది. దీంతో సమస్యలు షురూ అవుతాయి.

- ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవటం కూడా సమస్యే. ఈ తీరుతో మర్మాంగాల వద్ద వేడి పెరిగి.. వీర్యకణాల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. అందుకే.. అటు ఇటు తిరగడం అలవాటుగా చేసుకోండి.

- ఇంట్లో ఉన్నప్పుడు వదులుగా ఉంటే నిక్కర్లు (షాట్లు).. లుంగీలు.. నైట్ ఫ్యాంట్లను ధరించటం మేలు.

- ల్యాప్ టాప్ ను ఒళ్లో పెట్టుకోవద్దు. దాని నుంచి విడుదలయ్యే వేడి వృషణాలను తాకి వీర్యాన్ని దెబ్బ తీస్తుంది.

- బిగుతుగా ఉండే ఫ్యాంట్లు ధరించి ఎక్కువ దూరాలు బైకు మీద ప్రయాణించటం కూడా సంతానోత్పత్తి మీద ప్రభావాన్ని చూపుతాయి.

- తీసుకునే ఆహారం.. వాడే పాత్రలు విషయంలో జాగ్రత్తలు తీసుకొని.. ప్లాస్టిక్ బాటిళ్లు.. ప్లాస్టిక్ సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లను మళ్లీ మళ్లీ వాడకుండా జాగ్రత్తలు తీసుకోండి. సిగరెట్ తాగటం.. మద్యాన్ని సేవించటం బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది. సమస్య ఇంకా వేధిస్తుంటే వైద్యుల్ని కలిసి.. వారి సూచన మేరకు సప్లిమెంట్లను తీసుకోవాల్సిన ఉంటుంది. ఈ సందర్భంగా సొంత ప్రయత్నాలు మాత్రం చేయొద్దు.