Begin typing your search above and press return to search.
కరోనా వేళ మన డాక్టర్లు చేసిన పాడు పని చెప్పిన తాజా రిపోర్టు
By: Tupaki Desk | 3 July 2021 4:30 AM GMTషాకింగ్ అధ్యయన వివరాలు బయటకు వచ్చాయి. కరోనా మొదటి వేవ్ సందర్భంగా మన దేశంలోని వైద్యులు చేసిన ఘనకార్యాల్ని వాషింగ్టన్ వర్సిటీ వెల్లడించింది. కరోనాను కట్టడి చేసేందుకు మన వైద్యులు యాంటీబయాటిక్స్ ను ఇష్టారాజ్యంగా వాడేసిన వైనాన్ని గణాంకాలతో పేర్కొనటం గమనార్హం. మొదటి వేవ్ లో యాంటీబయాటిక్ మందుల దుర్వినియోగం భారత్ లో భారీగా చోటు చేసుకున్నట్లు వెల్లడించారు.
2020 జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశ వ్యాప్తంగా 21.64 కోట్ల డోసుల యాంటీ బయాటిక్ ఔషధాన్ని వినియోగించినట్లుగా గుర్తించారు. అన్నింటికి మించి అజిత్రోమైసిన్ అమ్మకాలు భారీగా పెరిగినట్లు గుర్తించారు. కరోనాకు ముందు సంవత్సరంలో అమ్మడైన వాటితో పోలిస్తే 3.8 కోట్ల డోసులు ఎక్కువగా అమ్ముడైనట్లుగా పేర్కొన్నారు. 2018, 2019 రెండేళ్లలో కలిపి అమ్మిన యాంటీ బయాటిక్స్ కంటే కాస్త తక్కువగా 2020లో అమ్మినట్లుగా తేల్చారు.
మరింత ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మొదటి వేవ్ లో అమెరికాతోపాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో యాంటీబయాటిక్ ఔషధాల వినియోగం తక్కువగా సాగింది. అంతకు ముందు ఏడాదితో పోల్చినా కరోనా వేళ.. యాంటీ బయాటిక్ డ్రగ్ ను వినియోగించలేదు. కొవిడ్ 19 లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ కు యాంటీబయాటిక్ మందుల్ని వాడకూడదని.. ఇది ప్రజారోగ్యానికి పెను ముప్పుగా చెబుతున్నారు.
అందుకు భిన్నంగా మన దేశంలో మాత్రం యాంటీ బయాటిక్స్ నే ప్రధానంగా వాడటం గమనార్హం. యాంటీబయాటిక్స్ ను దుర్వినియోగం చేస్తే.. తేలికపాటి గాయాలు.. న్యూమోమనియాలాంటి సాధారణ ఇన్షెక్షన్లను తగ్గించే శక్తి ఉండదని.. దీని వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు సైతం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ లెక్కన మన వైద్యులు చేసిన వైద్యం గురించి ఆలోచిస్తే బుర్ర వేడెక్కిపోవటం ఖాయం.