Begin typing your search above and press return to search.

పురుషుల్లో మాయమవుతున్న 'వై'.. భవిష్యత్ ఏంటి?

By:  Tupaki Desk   |   7 Dec 2022 7:30 AM GMT
పురుషుల్లో మాయమవుతున్న వై.. భవిష్యత్ ఏంటి?
X
మనుషులు.. క్షీరదాల్లో సంతానోత్పత్తి కలగాలంటే ఎక్స్.. వై క్రోమోజములు అవసరం. పుట్టబోయే శిశువు ఆడనో.. మగనో నిర్ధారించడంలో ‘వై’ క్రోమోజమ్ పాత్ర కీలకంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వై క్రోమోజోము రాబోయే కాలంలో అంతరించిపోతుందని జపాన్ సైంటిస్టుల పరిశోధనలో తాజాగా వెల్లడైంది.

ఈ నేపథ్యంలోనే పురుషుల భవిష్యత్ ఏంటీ? త్వరలోనే మానవ జాతి అంతరించిపోవడం ఖాయమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జపాన్ సైంటిస్టులు రాబోయే రోజుల్లో మానవులలో కొత్త జాతుల ఆవిర్భావం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం జరుగకుంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మానవ జాతి పూర్తిగా అంతరించి పోవడం ఖాయమని పేర్కొంటున్నారు.

సాధారణంగా స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. పురుషుల్లో మాత్రం ఎక్స్ తోపాటు వై క్రోమోజోము ఉంటుంది. ఎక్స్ లో దాదాపు 900 జన్యువులు.. వై లో 55 జన్యువులు ఉంటాయి. పిండంలో పురుష సంబంధిత వ్యవస్థలను ప్రేరింపే ముఖ్యమైన జీన్ వై క్రోమోజోములో ఉంటుంది. అండం శుక్రకణంతో ఫలదీకరణం చెందిన 12 వారాల తర్వాత ఈ జీన్స్ క్రియశీలమవుతూ వృషణాల వృద్దిని నియంత్రించే ఇతర జన్యువులను స్వీచాన్ చేసి శిశువు జననానికి కారణమవుతుంది.

జపాన్ సైంటిస్టులు స్పైనీ ర్యాట్ పై జరిపిన పరిశోధనల్లో వై కి సంబంధఇంచిన జన్యువులు వలస వెళ్లినట్లు వెల్లడైంది. కీలకమైన ఎస్ఆర్వై జన్యవు జాడ కన్పించలేదు. దీనిపై మరింత పరిశోధన చేయగా కేవలం మగ జీవుల్లోనే ఈ జన్యుక్రమాలు జరిగినట్లు సైంటిస్టులు గుర్తించారు. ఎస్ఆర్వై చర్యకు ఎస్వోఎక్స్9 ఆన్ చేసే స్విచ్ డూప్లికేటెడ్ డీఎన్ఏ ఉన్నట్లు వీరి పరిశోధనలో వెలుగు చూసింది. ఈ మార్పు వల్ల ఎస్ఆర్వై లేకుండా ఎస్వోఎక్స్ 9 పని చేస్తుందని తేలింది.

దీని ఫలితంగా ఈ జీవుల్లో వై క్రోమోజోము లేకుండానే మగ సంతానం వృద్ధి చెందినట్లు సైంటిస్టులు గుర్తించారు. ఇప్పటికే కొన్ని రకాల బల్లులు.. పాముల్లో ఆడ జాతే ఉంది. ఇవే తమ జన్యువుల సాయంతో స్వీయ గుడ్లను ఉత్పత్తి చేస్తూ సంతానొత్పత్తి చేస్తున్నాయి. అయితే మానవుల్లో ఈ ప్రక్రియకు ఆస్కారం లేదు. దీంతో సంతానోత్పత్తి జరుగాలంటే వై క్రోమోజోము తప్పనిసరి.

ఒకవేళ వై క్రోమోజోము పురుషుల్లో అంతరిస్తే మాత్రం మానవళి అంతరించిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో కొత్త జాతుల ఆవిర్భావం జరగొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది మానవుల్లో విభిన్న జాతుల కలయిక కారణం కావచ్చనే సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్ సైంటిస్టులు ‘వై’ క్రోమోజోము అంతర్థానంపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నారు.