Begin typing your search above and press return to search.

గంటకు ఒకరిని పొట్టన పెట్టుకుంటున్న డ్రగ్స్ భూతం!

By:  Tupaki Desk   |   16 Nov 2021 4:11 AM GMT
గంటకు ఒకరిని పొట్టన పెట్టుకుంటున్న డ్రగ్స్ భూతం!
X
భారతదేశంలో డ్రగ్స్ వినియోగం నానాటికీ పెరిగిపోతుంది. ఇందుకు సంబంధించిన వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ డ్రగ్స్ అనేవి మానవుని జీవితంపై తీవ్రమైనటు వంటి ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకసారి వీటికి అలవాటు పడ్డ వ్యక్తి వీటి నుంచి దూరంగా ఉండలేక మానసికంగా కుంగి పోతున్నాడు. తొలుత ఏదైనా బాధ కలిగితే డ్రగ్స్ తీసుకోవడం అనేది ప్రస్తుతం చాలామందిలో పరిపాటిగా మారింది. అయితే ఈ డ్రగ్స్ ద్వారా వారి ఆలోచన పూర్తిగా నశించే స్థాయికి చేరుకుంటుందని ఇటీవల కొన్ని సర్వేలు వెల్లడించిన అధ్యయనాల్లో స్పష్టమైంది.

ఇదిలా ఉంటే డ్రగ్స్ కు బానిసైన వారు దానిని వదులుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు. ఇటీవల నార్కోటిక్స్ క్రైమ్ రికార్డ్స్ విడుదల చేసిన ఓ నివేదికలో స్పష్టమైంది. డ్రగ్స్ కారణంగా భారతదేశంలో చనిపోయిన వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతోందని నివేదిక చెబుతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు మాధక ద్రవ్యాలను తీసుకునే వారి సంఖ్య పెరిగినట్లు నార్కోటిక్స్ అధికారులు చెబుతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం ఏదో ఒక రూపంలో చేతులు మారుతున్నాయని పేర్కొన్నారు.

మాదక ద్రవ్యాలు తీసుకోవడం కారణంగా మనసిక సమస్యలు ఏర్పడి మన దేశంలో ప్రతి 60 నిమిషాలకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నార్కోటిక్స్ బ్యూరో క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి. 2019 తో పోలిస్తే 2020లో మనదేశంలో డ్రగ్స్ తీసుకోవడం మరింత పెరిగింది. అంతేగాకుండా ఇలా డ్రగ్స్ కారణంగా ఆత్మహత్య చేసుకుని మరణించిన వారి సంఖ్య సుమారు 17 శాతం పెరిగినట్లు నార్కోటిక్స్ నివేదిక స్పష్టం చేసింది. ఇలా ఏటేటా మరింత పెరుగుతున్నట్లు పేర్కొంది. 2019 సంవత్సరంలో మాదక ద్రవ్యాల కారణంగా ప్రాణం కోల్పోయిన వారి సంఖ్య 7860గా ఉంది.

మరోవైపు ఈ సంఖ్య 2020 కి వచ్చేసరికి మరింత పెరిగింది. సుమారు తొమ్మిది వేల మందికిపైగా డ్రగ్స్ కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు నార్కోటిక్స్ అధికారులు విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. మాదకద్రవ్యాలను తీసుకోవడం ద్వారా ఆత్మహత్య చేసుకున్న వారు ఎక్కువ శాతం మంది కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారే అని అధికారులు చెప్పారు. దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్యతో పోలిస్తే కేవలం ఈ రెండు రాష్ట్రాల్లో చనిపోయినా వారి సంఖ్య 43% గా ఉంది.

మాదకద్రవ్యాల ప్రభావం తో ఆత్మహత్యకు పాల్పడే వారిలో ఎక్కువ మంది కుటుంబ సమస్యలతో బాధపడే వారే అని నార్కోటిక్ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా మీరు ముందుగా మద్యానికి బానిసై.. అనంతరం డ్రగ్స్ కు బానిసలు అవుతారని చెప్పుకొచ్చారు. వ్యక్తులకు దూరమయ్యారు అనే బాధతో.. ఆ ఎడబాటుని భరించలేక చాలామంది మాదకద్రవ్యాల వైపు అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. వీటికి బానిసైన వారు చాలా మంది మానసిక సమస్యలకు గురైనట్లు గణాంకాలు కూడా చెబుతున్నాయి.