Begin typing your search above and press return to search.

తూర్పు కాపుల‌పై ప‌వ‌నాస్త్రాలు.. ప‌నిచేస్తాయా..?

By:  Tupaki Desk   |   27 Nov 2022 6:32 AM GMT
తూర్పు కాపుల‌పై ప‌వ‌నాస్త్రాలు.. ప‌నిచేస్తాయా..?
X
ఉత్త‌రాంధ్ర‌లో దాదాపు 40 శాతం ఉన్న తూర్పు కాపు సామాజిక వ‌ర్గంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ దృష్టి పెట్టారు. వీరిని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా ఈ వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌ను ప్ర‌త్యేకంగా మంగ‌ళ‌గిరి పిలిపించుకుని మ‌రీ చ‌ర్చించారు. రాష్ట్రంలో తూర్పు కాపుల‌కు జ‌రగుతున్న అన్యాయాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. స‌మాజంలో వెనుక‌బ‌డి ఉన్న తీరును ఆయ‌న వివ‌రించారు.

ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం కులాల‌ను వాడుకుని వ‌దిలేస్తోంది.. అనే కీల‌క‌మైన కాన్సెప్టును ఆయ‌న తీసు కువ‌చ్చారు. కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసి, చైర్మ‌న్ల‌కు జీతాలు ఇచ్చి.. ఆయా కులాల‌కు జ‌రుగుతున్న అన్యా యాన్ని బ‌య‌ట‌కు రాకుండా అడ్డుకుంటున్నార‌ని కూడా ఆయ‌న అన్నారు.

అయితే, ఇక్క‌డ ప‌వ‌న్ చిన్న ప్ర‌యోగం చేసిన‌ట్టు తెలుస్తోంది. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేసే ఆయ‌న తాజాగా మాత్రం ఆయ‌న‌పై ఒక‌విధ‌మైన జాలి కురిపించారు.

సీనియ‌ర్ మంత్రి అయిన బొత్స‌కు తూర్పు కాపుల‌కు జ‌రుగుతున్న అన్యాయం గురించి తెలియ‌నిది కాద ని.. ఆయ‌న ఈ విష‌యాల‌ను పార్టీ అధిష్టానం ద‌గ్గ‌ర చెబుతున్నార‌ని, అయినాఆయ‌న కూడా నిస్స‌హాయ స్థితిలో ఉండిపోయార‌ని వ్యాఖ్యానించారు పవ‌న్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌ను బ‌ల‌ప‌ర‌చాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. తాము అండ‌గా ఉంటామ‌ని కూడా చెప్పారు. అయితే.. కీల‌క‌మైన నాయ‌కుల‌కు కంచు కోట వంటి ఉత్త‌రాంధ్ర‌లో ప‌వ‌న్ అస్త్రాలు ప‌నిచేస్తాయా? అనేది ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. ఉత్త‌రాంధ్ర‌ను తీసుకుంటే.. బొత్స కుటుంబం దూకుడు అంతా ఇంతా కాదు. వీరిని బ‌లంగా ఎదుర్కొనాల్సి రావ‌డం.. జ‌న‌సేన‌కు ఈజీకాద‌నేది గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే తేలిపోయింది అయితే, ఈ కుటుంబం నుంచి ఎవ‌రినైనా త‌న విప్పుకొంటే విజ‌య‌న‌గ‌రంలో ఒకింత ప‌ట్టు పెంచుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.

పైగా.. ప‌వ‌న్ చెబుతున్న విష‌యాల‌ను వింటున్న వారు ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఓటు వేస్తారా? అనేది ఆలోచించాల్సిన విష‌యంగానే క‌నిపిస్తోంది. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. ప‌వ‌న్ సంధిస్తున్న అస్త్రాల‌కు తూర్పు కాపులు అయితే ప‌డ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు.