Begin typing your search above and press return to search.

ఆ స‌ర్వే నిజ‌మేనా? జ‌గ‌న్‌కు 43శాతం మ‌ద్ద‌తుంటే.. మిగ‌తా 57 శాతం మాటేంటి?

By:  Tupaki Desk   |   22 Jan 2022 12:30 PM GMT
ఆ స‌ర్వే నిజ‌మేనా? జ‌గ‌న్‌కు 43శాతం మ‌ద్ద‌తుంటే.. మిగ‌తా 57 శాతం మాటేంటి?
X
ప్ర‌జాస్వామ్య దేశంలో ప్ర‌తి ఐదేళ్ల‌కు ప్ర‌భుత్వాలు మారుతుంటాయి. దేశంలోను, రాష్ట్రాల్లోనూ.. ఈ మార్పు స‌హ‌జం అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ‌కీయాలు కూడా మారుతున్నాయి. ఈ క్ర‌మం లో ఏ పార్టీ ఎప్పుడు ఎలా పుంజుకుంటుందో.. ఏ పార్టీ ఎప్పుడు బ‌లం పెంచుకుంటుందో చెప్ప‌డం క‌ష్టం. అందుకే.. పార్టీల బ‌లాలు.. ఎప్పుడూ నిల‌క‌డ‌గా ఉండ‌వు. దీనిని బ‌ట్టే.. ప్ర‌జ‌ల నాడి ఆధార‌ప‌డి ఉంటుం ది. ఇలాంటి విష‌యాల‌కు సంబంధించే స‌ర్వేలు వెలుగు చూస్తుంటాయి. ఈ పార్టీ బ‌లం పెరిగింది.. ఈ పార్టీ బ‌లం త‌గ్గింది.. ఈ నాయ‌కుడు పుంజుకున్నాడు.. ఇలా అనేక అంశాల‌తో స‌ర్వేలు వ‌స్తుంటాయి.

తాజాగా దేశంలో రాజ‌కీయ‌ప‌రిస్తిలను అంచ‌నా వేస్తూ.. ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ సీ-ఓట‌రు, ఇండియా టుడేలు సంయుక్తం గా దేశ‌వ్యాప్తంగా స‌ర్వే నిర్వ‌హించాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నాయ‌కుల గ్రాఫ్ ఎలా ఉంద‌నేది ఈ సర్వే సారాంశం. కేంద్రంలో మ‌రోసారి.. మోడీన‌నే అధికారంలోకి వ‌స్తార‌ని.. స‌ర్వే తేల్చింది. అయితే.. సీట్ల సంఖ్య మాత్రం త‌గ్గుతుంద‌ని పేర్కొంది. ఇదే స‌మ‌యంలో రాష్ట్రాల ముఖ్య మంత్రులు.. అధికార పార్టీల వ్య‌వ‌హారాన్ని కూడా ఈ స‌ర్వే వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా పాల‌క ప‌క్షాల పై ప్ర‌జ‌ల‌కు అంత పాజిటివిటీ లేద‌ని తేల్చింది.

ఇక‌, ఇవ‌న్నీ ఎలా ఉన్నా..ఏపీ గురించి.. కూడా ఈస‌ర్వే కొన్ని విష‌యాలు వెల్లడించింది. దేశ‌వ్యాప్తంగా ముఖ్య‌మంత్రుల‌పై ప్ర‌జ‌ల‌కు 43 శాంతం పాజిటివిటీని మించ‌డం లేద‌ని పేర్కొంటూ.. యూపీ సీఎం, డిల్లీ సీఎంల పేర్లు పేర్కొన్నారు. అయితే.. ఈ జాబితాలో ఏపీ సీఎం జ‌గ‌న్ కొంచం త‌క్కువ‌గా ఉన్నారు. అంటే.. ఆయ‌న‌కు 43 శాతం పాజిటివిటీ ఉంద‌ని తెలుస్తోంది. సో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని ప‌రోక్షంగా ఈ స‌ర్వే చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా ప్ర‌ధాన పోరు.. టీడీపీ-వైసీపీల మ‌ధ్యే ఉంటుంద‌ని స‌ర్వే పేర్కొంది. కాంగ్రెస్‌, బీజేపీలు ఏపీలో పుంజుకునే ప‌రిస్థితి లేద‌ని స‌ర్వే వెల్ల‌డించింది. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది. కానీ.. ఈ స‌ర్వేలో కీల‌క విష‌యాల‌ను వివ‌రించ‌క‌పోవ‌డంతో అస‌లు ఈ స‌ర్వే పెయిడా? అనే సందేహాలు వ‌చ్చేలా చేసింది. ఒక్క జ‌గ‌న్‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించ‌డం సందేహంగా మారింద‌ని మేధావులు అంటున్నారు.

సందేహాల‌కు తావిచ్చిన అంశాలు ఇవే!

+ స‌ర్వేలో జ‌గ‌న్‌కు 43 శాతం పాజిటివిటీ ఉంద‌న్నారు. మ‌రి 57 శాతం పాజిటివిటీ ఎవ‌రికి ఉంది? అనేది చెప్ప‌క‌పోవ‌డం.

+ ముఖ్యంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీకి ఎన్ని ఓట్లు వ‌స్తాయి. ఆ పార్టీకి ఉన్న పాజిటివిటీ ఎంత‌? అనేది కూడా చెప్పాలి క‌దా!

+ ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కీల‌క పాత్ర పోషిస్తుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. కానీ, ఈ స‌ర్వేలో ఈ పార్టీ ఊసే క‌నిపించ‌లేదు. ఇది కూడా సందేహానికి దారితీస్తోంది.

+ అదేస‌మ‌యంలో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంద‌ని రెండు మాసాలుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. ఏం జ‌రుగుతుంది? అనే విష‌యం కూడా స‌ర్వేలో చెప్పాలి. కానీ, అలా చెప్పలేదు.

+ ఇక‌, ఎంతో మంది సీఎంలు, రాష్ట్రాల గురించి చెప్పిన స‌ర్వే.. కీల‌క‌మైన‌ తెలంగాణ ను ఎందుకు ప‌క్క‌న పెట్టింది. సీఎం కేసీఆర్ మ‌ళ్లీ రావాల‌ని చూస్తుంటే.. ఆయ‌న‌ను దింపేస్తామ‌ని.. ప్ర‌ధాన పార్టీలు శ‌ప‌థం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రోజుకో రాజ‌కీయ ర‌ణ‌రంగం తెర‌మీదికి వ‌స్తున్న ఈ రాష్ట్రాన్ని విడ‌డిచి పెట్టేయ‌డం వెనుక ఏం జ‌రిగింది? ఇవీ.. ఇప్పుడు ఈ స‌ర్వేపై త‌లెత్తున్న అనుమానాలు. మ‌రి దీనిని బ‌ట్టి ఈ స‌ర్వేలో నిజ‌మెంత‌? అంటున్నారు మేధావులు.