Begin typing your search above and press return to search.
కరోనా తర్వాత తగ్గిన మనిషి ఆయుష్షు
By: Tupaki Desk | 24 Oct 2021 4:10 AM GMTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచం మొత్తానికి పాకి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది. రెండు సంవత్సరాలుగా వేరియంట్ల రూపంలో మారుతున్న కరోనా తాజాగా కొన్ని దేశాల్లో ఇంకా విజృంభిస్తూనే ఉంది. అయితే వ్యాక్సినేషన్ ప్రభావంతో కాస్త తగ్గినట్లు అనిపించినా ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కరోనా నిబంధనలు, జాగ్రత్తలు ఇంకా పాటించాల్సిందేనని ఆయా దేశాల ప్రతినిధులు తెలుపుతున్నారు. గత సంవత్సరం కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో సెకండ్ వేవ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆ తరువాత లెక్కలేనన్ని ప్రాణాలను మింగింది. సెకండ్ వేవ్ గుణపాఠం నేర్చుకున్న తరువాత చాలా దేశాలు జాగ్రత్త పడ్డాయి. వ్యాక్సినేషన్ జోరు పెంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
కరోనా వైరస్ తీవ్రత తగ్గినా దాని సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఇంకా ఉంది. కరోనా వచ్చి తగ్గిన వారిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య అధ్యయనంలో తేలింది. అయితే చాలా మందిలో ఇతర వ్యాధులు దీనికి తోడై వారికి సమస్యలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నా.. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు సైతం కరోనా వచ్చి తగ్గినా.. వారిలో కొత్త సమస్యలు మొదలవుతున్నాయని అంటున్నారు. అయితే ఇది అందరిలో జరుగుతున్నదని మాత్రం చెప్పలేమంటున్నారు. కానీ వ్యాక్సినేషన్ ప్రభావంతో కరోనా తీవ్రత తగ్గిందనే చెప్పాలి.
ఇటీవల భారత్ వందకోట్ల వ్యాక్సినేషన్ వేసినట్లు ప్రకటించింది. దీంతో 90 శాతం దేశ ప్రజలకు ఏదో ఒక డోసు తమ శరీరంలోకి వెళ్లింది. మొదట్లో వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించకపోవడంతో చాలా మంది టీకా తీసుకునేందుకు ముందుకు రాలేదు. పైగా వ్యాక్సిన్ వేసుకున్న తరువాత అనేక వ్యాధులకు గురవుతున్నారని ప్రచారం జరగడంతో వ్యాక్సిన్ పై భయం పట్టుకుంది. కానీ ప్రభుత్వం ఈ విషయంలో గట్ట చర్యలు తీసుకుంది. నిర్బంధ వ్యాక్సినేషన్ ప్రయోగాన్ని చేపట్టింది. ప్రజలు సెంటర్లలోకి రాకపోవడంతో వారి వద్దకే వెళ్లి టీకాలు అందిస్తున్నారు. ఇళ్లల్లోకి, పనిస్థలాల్లోకి వెళ్లి మరీ టీకాలు ఇస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలతోనే 100 కోట్ల వ్యాక్సిన్ సాధ్యమైందని అంటున్నారు.
ఇప్పటి వరకు వృద్ధుల్లో దాదాపు రెండు డోసులు పూర్తి కాగా, నడీడు వయస్కుల్లో ప్రతీ ఒక్కిరిక మొదటిడోసు పడిందని వైద్యులు అంటున్నారు. అయితే ఇంకా లోతుగా పరిశీలన చేసిన ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారికి టీకా అందిస్తామని అంటున్నారు. మొత్తంగా వ్యాక్సినేషన్ ప్రభావతో కరోనాకు కాస్త కట్టడి వేసినట్లయిందని అంటున్నారు. అయితే థర్డ్ వేవ్ ముప్పు ఇంకా తొలిగిపోలేదని, ఏ క్షణమైనా అదిప్రారంభం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డబ్ల్యూహెచ్ ప్రతినిధుల్లోకొందరు థర్డ్ వేవ్ ఉండకపోవచ్చని తెలిపినా.. భారత్ లాంటి దేశాలకు మాత్రం ముప్పు లేదని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఎందుకంటే సెకండ్ వేవ్ పై ఎలాంటి అంచనాలు లేకపోవడంతో కేసులు విజృంభించాయి. అలాగే థర్డ్ వేవ్ పై కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని అంటున్నారు. కానీ కొందరు సెప్టెంబర్లో, మరికొందరు అక్టోబర్లో ముప్పు ఉందని హెచ్చరించారు. కానీ ఈ రెండు నెలలు పూర్తవుతున్న దృష్ట్యా కేసుల్లో పెరుగుదల లేకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయమని అంటున్నారు. అయితే జీరో స్థాయికి కేసులు వచ్చినప్పుడే కరోనా లేదనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు.
ఇదిలా ఉండగా కరోనా వైరస్ ప్రభావం తరువాత మనిషి ఆయుష్సు కాలం తగ్గిందని తగ్గిందని బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్ తెలిపింది. ఐపీఎస్ సూర్యకాంత్ యాదవ్ ఆద్వర్యలో తయారు చేసిన నివేదికలో ఈ విషయాన్ని చెప్పారు. 2019లో పురుషుల ఆయుష్షు 69.2 ఏళ్లు ఉండగా, స్త్రీలల్లో 72 ఏళ్లు ఉంది. కానీ ఇప్పుడు పురుషుల్లో 67.5, స్త్రీలల్లో 69.8 ఏళ్లకు తగ్గిందన్నారు. అంటే కరోనా తరువాత మనిషి ఆయుష్షు రెండేళ్లు తగ్గిందని ఈ నివేదిక తెలుపుతోంది.