Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ లో గెలుపెవరిది?
By: Tupaki Desk | 30 Sep 2021 2:30 AM GMTతెలంగాణ ప్రజానీకం ఇప్పుడు హుజూరాబాద్ వైపు చూస్తోంది. ఇక్కడ జరిగే ఉప ఎన్నికపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణ ఎన్నికలను మించి పోయేలా ఇక్కడి రాజకీయ పార్టీలు శ్రమించడం చూసి ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. హుజూరాబాద్ లో జరిగే ఉప ఎన్నిక పోరు వ్యక్తులా.. లేక పార్టీల మధ్య జరుగుతుందా..? అన్న ఆసక్తి రేపింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుధీర్ఘ కాలంగా ఉన్న ఈటల రాజేందర్ ఆరుసార్లు హుజూరాబాద్ లో ఎమ్మెల్యే గా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత ఆయన మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ కావడంతో బీజేపీలోకి చేరారు. అయితే కేవలం ఈటలను ఓడించాలన్న పట్టుదలతోనే టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అర్థమవుతోంది. కానీ కేవలం ఉప ఎన్నిక కోసం పార్టీ ఇంత ప్రాధాన్యం ఇవ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది.
హుజూరాబాద్ ప్రజలను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ ఎప్పటి నుంచో వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గం ఓట్లను ముందే లెక్కించింది. నియోజకవర్గంలో 2 లక్షల 36 వేల ఓట్లుుండగా ఇందులో బీసీలు లక్షా 32 వేలు, దళితులు 45 వేలు ఉన్నారు. మిగతా వారు ఇతర కులాలకు చెందిన వారుంన్నారు. మొత్తంగా ఇక్కడ ఎస్సీ, బీసీ ఓట్లు అధికంగా ఉన్నాయని గుర్తించింది. అందువల్ల ముందుగా దళిత బంధు పథకంలో ఎస్సీ ఓట్లను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా దళిత కాలనీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూరుస్తోంది. ఇక బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింది. గొర్ల పంపిణీ లాంటి పథకాలతో ఆ వర్గాలను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ లేకపోతే వ్యక్తి శూన్యం అని చెప్పేందుకు పార్టీ నాయకులంతా కలిసి కట్టుగా నియోజకవర్గంలో మకాం వేశారు. నియోజకవర్గ బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగించారు. ఆయన నేతృత్వంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లు కూడా రోజూ పర్యటన చేస్తున్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేలకు మండలం చొప్పున బాధ్యతలు అప్పగించడంతో వారు అక్కడి ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఓ వైపు అధికార పార్టీ టీఆర్ఎస్ హుజూరాబాద్ సీటును ఎలాగైనా వదులుకునే ప్రసక్తే లేదన్నట్లు పావులు కదుపుతుండగా.. బీజేపీ సైతం అందుకు తగ్గ పోటీనిస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆయనకు ఫుల్ సపోర్టు ఉంటోంది. రాష్ట్రనాయకత్వంతో పాటు కేంద్రంలోని కీలక నాయకులు సైతం ఈటలకు మద్దతునిస్తున్నారు. ఇక వ్యక్తిగతంగా తనకున్న ప్రజా ప్రాధాన్యతను తగ్గిపోకుండా గడపగడపకు తిరుగుతూ పాదయాత్ర చేపట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ యాత్ర మధ్యలోనే ఆగిపోవడంతో ఆ యాత్ర బాధ్యతలను పార్టీ రాష్ట్ర నాయకుడు బండిసంజయ్ తనమీద వేసుకున్నారు.
హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ వరకు చేపట్టిన ఈ యాత్ర త్వరలోనే హుజూరాబాద్ కు చేరనుంది. అక్టోబర్ 2న భారీ బహిరంగ సభతో యాత్రను ముగించేందుకు రెడీ అవుతున్నారు. ఇన్ని రోజులు చేసిన యాత్రలో బీజేపీకి ఊరూరా మద్దతు లభించినా హుజూరాబాద్ ప్రజలు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. అయితే ప్రభత్వం చేస్తున్నతప్పులను ఎత్తిచూపుతూ.. ఈటల ప్రజలను ఆకట్టుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. కానీ టీఆర్ఎస్ మత్రం సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటోందన్న మరో వాదన వినిపిస్తోంది. టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించినా..బీజేపీ నుంచి ఈటల ఖాయమని తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుస్తుందని టీఆర్ఎస్ భావిస్తున్నా.. ఈటల రాజేందర్ మాత్రం తాను ఏ పార్టీలో ఉన్న తనపై హుజూరాబాద్ ప్రజలకు నమ్మకం ఉందని భావిస్తున్నారు. ఏదీఏమైనా నవంబర్ 2న పార్టీ గెలుస్తుందా..? వ్యక్తి గెలుస్తాడా..? అనేది తేలిపోనుంది.