Begin typing your search above and press return to search.
సిరి సంపదలకు కొదవ లేదు.. శ్రీమంతులమనే ఫీలింగ్ తగ్గిపోతోందట
By: Tupaki Desk | 21 Feb 2022 11:30 AM GMTకొండ మీద కోతినైనా తీసుకొచ్చే సత్తా ఎవరి సొంతమంటే.. చేతిలో పుష్కలంగా డబ్బులున్న వారికే. క్యాలెండర్లో ఏళ్లు గడుస్తున్న కొద్దీ.. సిరిసంపదనల్ని టన్నుల కొద్దీ పోగేసి.. వేలాది కోట్లను తమ సొంతం చేసుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం కోటి సంపాదన అంటే.. అదో అద్భుతంగా ఉండేది. ఇవాల్టి రోజున ఒక ఐటీ ఉద్యోగి సైతం సంపాదిస్తున్నారు. సంపదనల్ని పోగేయటం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమైన పని కాదు.
కాకుంటే.. క్రమశిక్షణ.. అదే సమయంలో తమ వద్ద ఉన్న డబ్బుల్ని తెలివిగా పెట్టుబడిగా మార్చటంలోనే సక్సస్ ఉంది. ఏడాదికేడాది సిరిసంపదల్ని పెద్ద ఎత్తున సొంతం చేసుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
డబ్బు సంపాదన విషయంలో కొదవ లేకున్నా.. అలాంటి వారిలో సంతృప్తి ఎంత? అన్న ప్రశ్నను సంధిస్తే మాత్రం సానుకూల సమాధానం రాని పరిస్థితి. సంపన్న కుటుంబాల్లోని వారికి ఇప్పుడు ఎదురవుతున్న అతి పెద్ద సమస్య ఏమిటో తెలుసా? వారి వ్యక్తిగత.. వృత్తిపరమైన జీవితంలో సంతృప్తితో ఉన్న వారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. ఇదో సమస్యగా వారిని వెంటాడుతోంది. తాజాగా విడుదలైన గణాంకాల్ని చూస్తే.. ఈ విషయం మరింత స్పష్టమవుతుంది.
2020లో తమ జీవితం (వ్యక్తిగత.. వృత్తిపరమైన)లో సంతృప్తి శాతం 72గా ఉంటే.. 2021 నాటికి అది కాస్తా 66 శాతానికి తగ్గిపోవటం గమనార్హం. ఇది కూడా ఆషామాషీ సంపన్నుల్ని కాక.. ఒక కొలమానం పెట్టుకొని మరీ సర్వే నిర్వహించారు. ఈ సంతృప్తి శాతాన్ని లెక్క వేసేందుకు 350 మిలియన్ డాలర్లు (మన రూపాయిల్లో చూస్తే రూ.2600కోట్ల సంపద ఉన్న వారు) ఉన్న వారిలో సంతృప్తి స్థాయిల్ని హురూన్ సంస్థ సర్వే నిర్వహించింది.
ఇందులోని వారు తాము సంతృప్తిని మిస్ అవుతున్నామని చెప్పటం గమనార్హం. సర్వేలో పాల్గొన్న వారిలో 31 శాతం మంది పన్నులు చెల్లించటమే తమ సామాజిక బాధ్యతగా ఫీల్ అవుతున్నారట. తాము పోగేసిన సంపదను సమాజానికి కొంతైనా తిరిగి ఇవ్వాలన్నది తమ బాధ్యతగా భావిస్తున్నవారు కేవలం 19 శాతం మంది మాత్రమే ఉన్నారట.
సంపన్నులు తమ పిల్లల్ని చదువు కోసం విదేశాలకు పంపే విషయంలో ముందు ఉంటున్నారు. దేశం ఏదైనా.. తమ పిల్లల్ని ఫలానా విద్యా సంస్థల్లో చేర్పించాలన్న లక్ష్యంతో ఉన్నారట. సంపన్నుల్లో 29 శాతం మంది తమ పిల్లల్ని చదువుకోసం అమెరికాకు పంపితే.. 19 శాతం మంది బ్రిటన్ కు పంపేందుకు ఇష్టపడుతున్నారు. 12 శాతం మంది న్యూజిలాండ్.. 11 శాతం మంది జర్మనీ వైపు చూస్తున్నారట.
ఇక.. సంపన్నులకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలకు వస్తే.. సంపన్నుల్లో అత్యధికులు వాచ్ ల సేకరణ కు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారట. అంతేకాదు.. తాము వాడే కార్లను మూడేళ్లలోపే మార్చేస్తామని సర్వేలో పాల్గొన్న 25 శాతం మంది చెప్పటం గమనార్హం. ఎన్ని సిరిసంపదలు ఉన్నా.. అసలుసిసలు ‘సిరి’ లాంటి సంతృప్తి లేని జీవితానికి మించిన శాపం ఇంకేం ఉంటుంది చెప్పండి.