Begin typing your search above and press return to search.

2050 నాటికి ముంబై ఉండదిక

By:  Tupaki Desk   |   18 Sep 2021 5:30 AM GMT
2050 నాటికి ముంబై ఉండదిక
X
ప్రకృతికి కోపం వస్తే ఎట్టుంటాదో తెలుసా? అంటే ‘కరోనాను చూస్తున్నాం’ కదా అనేది సమాధానంగా వస్తోంది. మనిషి విచ్చలవిడి తనానికి పుట్టించే ‘కరోనా వైరస్’. మనం నిర్లక్ష్యం వల్లే కొత్త వ్యాధులు పుట్టి మనపై ప్రకోపం చూపిస్తోంది. ఇప్పుడు మనిషి విపరీతంగా వదలుతున్న కాలుష్యం వల్ల కూడా ఇదే భూమికి పెనుముప్పుగా మారనుంది.

విపరీతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా మనిషికే పెనుముప్పుగా మారుతోంది. అది మన మానవ జీవనానికే ఎఫెక్ట్ కాబోతోంది. సముద్ర మట్టాలు పెరగడం వలన భారతదేశ ఆర్థిక రాజధానిలో ఎక్కువ భాగం మునగబోంది. ముంబై 2050 నాటికి నీటిలో మునిగిపోవచ్చని నాసా సంచలన హెచ్చరించింది. రాబోయే 30 సంవత్సరాలలో దాదాపు 80% ప్రసిద్ధ నారిమన్ పాయింట్, మంత్రాలయం పూర్తిగా నీటిలో మునిగిపోవచ్చని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ సంచలన ప్రకటన చేశారు.

రాబోయే 30 సంవత్సరాల కాలంలో ఆకస్మిక వరదలు సర్వసాధారణంగా ఉంటాయి. వాతావరణ మార్పు కారణంగా దక్షిణ ముంబై అత్యంత ప్రభావిత ప్రాంతం అవుతుంది. విపరీతమైన వాతావరణ పరిస్థితులు కూడా నగరం మునగడానికి దోహదం చేస్తాయి అని నాసా తెలిపింది.

ఈ రేటు ప్రకారం, ముంబై కనీసం 2050 నాటికి చాలా వరకు మునిగిపోతుంది. సముద్ర మట్టంలో 0.5 మీటర్ల పెరుగుదల ముంబై తీరప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో నివసించే 20-30 లక్షల మంది ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. రాబోయే 3 దశాబ్దాలలో పాక్షికంగా మునిగిపోయే అంచున ఉన్న భారతదేశంలోని 12 తీరప్రాంత నగరాల్లో ముంబై ఇప్పుడు ఒకటి కావడం గమనార్హం.

ఇక ఇప్పటికే విశాఖపట్నం, చెన్నై, కోల్ కతాలకు ఇలాంటి ముప్పు ఉందని నాసా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అందరికంటే ముందుగా మునిగేది మాత్రం ముంబై అని తేలింది.