Begin typing your search above and press return to search.

‘కన్నత్వం’కు కాలం చెల్లిందా..?

By:  Tupaki Desk   |   25 Sep 2021 11:30 PM GMT
‘కన్నత్వం’కు కాలం చెల్లిందా..?
X
శృంగారానికి సంబంధించిన కొన్ని పదాలను వాడడానికి ఇప్పటికీ చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే ఇవి మగవారి కంటే ఆడవారినే ఎక్కువగా ప్రభావం చేసేవిగా ఉండడంతో ఇందుకు సంబంధించిన పదాలను ఎక్కువగా వాడకుండా దాటవేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వాడుతున్న ‘కన్యత్వం’ అనే పదానికి ప్రత్యామ్నాయంగా మరో పదం వాడుకలోకి వచ్చింది. కొందరు ఈ పదం వాడడానికి సిగ్గుపడినప్పుడు దానికి కొత్త పదాలు వెతుక్కొని సులభంగా అందులో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవచ్చని అంటున్నారు కెనడాకు చెందిన నికోల్ హాడ్జెస్. ఆమె వర్జినిటీ అనే పదానికి కొత్త పదం కనుగొన్నారు. ఈ పదం వాడాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.

కెనడాలోని టోరంటోకు చెందిన నికోల్ హాడ్జెస్ గతేడాది ‘కన్నత్వం’ అనే పదానికి వ్యతిరేకంగా ఉద్యమించడం ప్రారంభించారు. లైంగిక వ్యక్తీకరణ, పురుషస్వామ్యానికి వ్యతిరేకంగా స్త్రీ సాధికారత గురించి ఆమె చేపట్టిన ప్రాజెక్టులో కన్నత్వం, అందుకు సంబంధించిన సాంప్రదాయ భావనల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పాతబడిన సాంప్రదాయాలకు, బలహీనమైన పదాలకు చెల్లుచీటి పలకాలన్నారు. వాటి స్థానంలో కొత్తపదాలను చేర్చి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

ఇందులో భాగంగా కన్నత్వం అనే పదానికి బదులు కొత్త పదాన్ని కనుగొన్నట్లు తెలిపారు. ‘కన్నత్వం, శీలత్వం అనేవి పాత పదాలు.. వాటికి బదులుగా ‘సెక్సువల్ డెబ్యూ’ అనే పదం వాడాలని హాడ్జెస్ సూచించారు. సెక్సువల్ డెబ్యూ అంటే తొలి లైంగిక అనుభవం అని అర్థం. దీనిని అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే తాను రచించిన ‘ఓమ్, ది ప్లేసెస్ యూ విల్ గో ఓహ్ ఓహ్’ అనే పుస్తకాన్ని 20202లో విడుదల చేశారు. ఈ పుస్తకంలో అందంగా వివరించినా కొందరు చివరికి ‘సెక్సువల్ డెబ్యూ’ అర్థమేంటని మరోసారి అడిగేసరికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు చెప్పారు.

సెక్సువల్ డెబ్యూ అనే పదం కొత్తగా పుట్టిందికాదు. అమెరికాలోని టెనస్సీకి చెందిన వాండర్ బిల్డ్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ కార్పెంటర్ మాట్లాడుతూ ‘ కన్నత్వం కోల్పోవడానికి వైద్య పరిభాషలో సెక్సువల్ డెబ్యూ అని అంటారని చెప్పారు. 1970-80లల్లో జరిగిన అధ్యయనాల్లో సెక్సువల్ డెబ్యూ పదం కనిపిస్తుంది. అప్పట్లో దీనిని ఎస్టీఐల అంటువ్యాధిగా పిలుచుకునేవారు. అని కార్పెంటర్ తెలిపారు.

పదాల వాడకంలో మార్పులను స్వాగతించాలని, కొత్త పదాల సృష్టించడం ద్వారా మన భావాలను ఈజీగా తెలిపే ఆస్కారం ఉంటుందని కార్పెంటర్ అంటారు. అయితే సెక్స్ కు సంబంధించిన కొన్ని పదాలకు ప్రత్యామ్నాయంగా వచ్చినవి చాలా తక్కువే. కొన్ని పాత పదాలనే ఇప్పటికీ వాడుతున్నారు. వీటి స్థానంలో కొత్త పదాలు వచ్చినా వాటిని స్వాగతించడ లేదు. అయితే ఇందుకోసం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కొందరు ప్రొఫెసర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కన్నత్వం అనే పదాన్ని రకరకాలుగా వాడుతారు. కన్నత్వం కోల్పోవడం అంటే ఒక అమ్మాయి తన జీవితాన్ని కోల్పోయినంత పనిగా వర్ణిస్తున్నారు. అయితే ఇలాంటి భావాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నానని హాడ్జెస్ అంటున్నారు. అయితే కన్నత్వం అనే పదం స్థానంలో సెక్సువల్ డెబ్యు అనే పదం చేర్చడం ద్వారా ఇప్పటి వరకు ఉన్నంతగా అమ్మాయిలు అవమానంగా ఫీలవరని అంటున్నారు. అంతేకాకుండా సెక్సువల్ డెబ్యూ అనే పదం ద్వారా చాలా మందికి అసలు విషయం కోసం ఎదురుచూస్తారు. అయితే కన్నత్వం పదం విషయంలో చాలా మందికి ఒకటే అభిప్రాయం ఉంటుందని వివరించారు. ఇలాంటప్పుడు సెక్సువల్ డెబ్యూ వాడడం నేర్చుకోవాలని అంటున్నారు. అయితే సెక్సువ్ డెబ్యూ పదం ఎంత వరకు ప్రజల్లోకి వెళ్తుందోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ లోపభూయిష్టమైన విధానం నుంచి బయటపడాలంటే ఇలాంటి పదాల అవసరం ఉందని హడ్జెస్ అంటున్నారు.