Begin typing your search above and press return to search.
స్టాలిన్ కు పట్టిన గతే పుతిన్ కు పడుతుందా..?
By: Tupaki Desk | 19 March 2022 5:54 AM GMTముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక.. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది రష్యా అధక్షుడు పుతిన్ కు. ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని ఎంత ప్రయత్నించినా పుతిన్ కు మాత్రం ఆ చాన్స్ రావడం లేదు. భీకర దాడులు కొనసాగిస్తున్నా ఉక్రెయిన్ ప్రజలు అందుకు ధీటుగా ఎదుర్కోవడంతో పుతిన్ కు పరాభావమే ఎదురవుతోంది. మరోవైపు పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో రష్యా పరిస్థిని ఆందోళనకరంగా మారింది. యుద్ధం కొనసాగించినా.. వెనకడుగు వేసినా.. పుతిన్ ఫెయిల్ అయినట్లేనని ప్రపంచ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా గతంలో స్టాలిన్ కు ఎదురైన అనుభవమే ఇప్పుుడు పుతిన్ ఎదుర్కోబోతాడని అంటున్నారు. మరి పుతిన్ రాను రాను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఉక్రెయిన్ ను రష్యా చాలా తేలికగా తీసుకుంది. ఒకటి, రెండు రోజుల్లో ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని భావించింది. అయితే ఉక్రెయిన్ ప్రజలు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యాకు ధీటుగా నిలబడుతూ.. దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో సాధారణ పౌరులు సైతం తుపాకులు చేతబట్టి రష్యా సైనికులను ఎదుర్కొన్నారు. అయితే చర్చల ద్వారానే సమస్య పరిస్కారం అవుతుందని రష్యా శాంతి చర్చల వైపు మొగ్గు చూపింది. కానీ అవి సఫలీకృతం కావడం లేదు. మరోవైపు నాటోలో చేరడం లేదని జెలెన్ స్కీ కూడా ప్రకటించారు. కానీ రష్యా మాత్రం యుద్ధం ఆపడం లేదు.
ఈక్రమంలో పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు నేరుగా సాయం చేయకపోయినా రష్యాపై ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్నీ ఆ దేశంపై ఆంక్షలు విధించడంతో రష్యా ఒంటరి దేశంగా మారింది. మొదట్లో ఉక్రెయిన్ కు నేరుగా సాయం చేయలేమని ఈయూ దేశాలు చెప్పినప్పుడు రష్యాకు మరింత బలం చేకూరినట్లయింది. దీంతో రష్యా ఉక్రెయిన్ పై భీర దాడులు చేసింది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలను ఆదీనంలోకి తెచ్చుకొని బాంబుల వర్షం కురిపించింది. అయితే ఈయూ దేశాలు ఉక్రెయిన్ దేశానికి మిలటరీ సాయం చేయకపోయినా ఆయుధ సాయం చేస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ కు అండ దొరికినట్లయింది.
ఉక్రెయిన్ కు ఈయూ దేశాలో పరోక్షంగానైనా అండగా ఉండడంతో రష్యా అధ్యక్షుడు పుతిని పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. అంతర్జాతీయంగా రష్యాకు ఎదురుదెబ్బలు తగలడంతో రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. స్టాక్ మార్కెట్లో నెలరోజులగా నష్టాలనే చవిచూస్తున్నాయి. అయితే ఈ ఆంక్షలు ఎన్నిరోజుల పాటు కొనసాగుతాయనేది క్లారిటీ లేకున్నా ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి దారుణంగా తయారవడంతో రష్యా ప్రజలు రోడ్లపైకి వచ్చి పుతిన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.
అటు ఆయుధ బలాన్ని పెంచుకుంటున్న ఉక్రెయిన్.. రష్యా మిలటరీలను ధీటుగా ఎదుర్కొంటోంది. సాధారణ పౌరులు సైతం యుద్ధంలో పాల్గొంటూ రష్యా బలగాలను అడ్డుకుంటున్నాయి. బాంబుల వర్షంతో కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసం అయినా.. మిగతా ప్రాంతాల్లోని వారు రష్యా సైనికులను ఎదురుతిరుగుతున్నారు. దీంతో పుతిన్ పరిస్థితి అయోమయంగా మారింది. అంతర్జాతీయంగా ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాకు ఉక్రెయిన్ ప్రజలు సైతం ఎదురు తిరగడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురైంది.
ఇదిలా ఉండగా 1940 సంవత్సంలో పిన్లాండ్ ను ఆక్రమించుకోవడానికి అప్పటి సోవియట్ యూనియన్ నేత స్టాలిన్ ఇలాగే ప్రవర్తించారు. పిన్లాండ్ పై బాంబలు వేసినా అక్కడి ప్రజలు ఎదురు తిరిగారు. చివరికి స్టాలిన్ తన సేనల్ని వెనక్కి రప్పించారు. ఇప్పుడు పుతిన్ కూడా అలాగే చేస్తారని అంటున్నారు. అయితే ఉక్రెయిన్ మరికొన్ని రోజుల పాటు ఇలాగే ఎదుర్కొంటే అప్పట్లో స్టాలిన్ కు పట్టిన గతే ఇప్పుడు పుతిన్ కు పడుతుందని అంటున్నారు.