Begin typing your search above and press return to search.
జైల్లో ఆర్యన్ కు ఆ భోజనమే పెడతారు
By: Tupaki Desk | 9 Oct 2021 3:21 AM GMTఅనూహ్య పరిణామాల మధ్య జైలుకు వెళ్లాల్సి వచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. అతని స్నేహితుల్ని ముంబయిలోని ఆర్దర్ జైల్లో ఉంచనున్నారు. తాజాగా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ.. పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచనున్న సంగతి తెలిసిందే. అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తాజాగా కొట్టేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని.. అతని స్నేహితుల్ని అర్ధర్ జైలుకు తరలించారు.
వారికి అక్కడ బ్యారక్ నంబరు 1ను కేటాయించారు. జైలులోని మొదటి అంతస్తులో ఉన్న ప్రత్యేక క్వారంటైన్ బ్యారక్ గా దీన్ని చెప్పాలి. ఆర్యన్ కు అతని స్నేహితులకు కరోనా నెగిటివ్ గా తేలటం.. వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో.. వారిని జైల్లోని ఇతర ఖైదీల మాదిరి పరిగణిస్తారు.
వారంతా ఉదయం ఆరు గంటలకే లేవాల్సి ఉంటుంది. ఏడు గంటలకు టిఫిన్ పెడతారు. మధ్యాహ్నం 11 గంటలకు భోజనం.. సాయంత్రం ఆరు గంటలకు రాత్రి భోజనం అందిస్తారు. ఇక.. వారికి సాదాసీదా జైలు భోజనం మాత్రమే తినాల్సి ఉంటుంది. కాకుంటే.. వారికి సొంత డబ్బులతో జైల్లోని క్యాంటీన్ లో ఆహార పదార్థాల్ని కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఉదయం టిఫిన్ కింద షీరా - పోహా ఉంటుంది. మధ్యాహ్నం.. రాత్రి భోజనంలో చపాతి.. కూర.. పప్పు.. అన్నం వడ్డిస్తారు. ఇంటి నుంచి భోజనం అతనికి అందాలంటే కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిన్న మొన్నటి వరకు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు యువరాజు మాదిరి బతికిన ఆర్యన్ కు జైలు జీవితం ఎన్నో కొత్త అనుభవాల్ని నేర్పుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.