Begin typing your search above and press return to search.
జగన్ వెరీ వీక్... గంటా సంచలనం
By: Tupaki Desk | 14 April 2022 10:28 AM GMTజగన్ బలవంతుడు కాడు, బలహీనుడు. ఈ మాటలు అన్నది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. జగన్ బలహీనతలు ఏంటి అన్నది మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలోనే తేలిపోయింది అని ఈ టీడీపీ సీనియర్ విశ్లేషించారు. ఈ బలహీనత కారణంగానే మంత్రి వర్గ కూర్పు తరువాత వెల్లువలా ఏపీలో నిరసనలు వచ్చాయి.
ఇక మంత్రి వర్గంలో చోటు లేదని సీఎం దిష్టి బొమ్మను తగులబెట్టడం, టైర్లను కాల్చడం తన పాతికేళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదని గంటా అన్నారు.
అదే విధంగా కొత్త క్యాబినేట్ ఏర్పాటు ఎల సమతూల్యత అన్నది ఎక్కడా లేదని ఆయన విమర్శించారు. ఏపీలోనే పెద్ద జిల్లాగా ఉన్న విశాఖకు, అలాగే, విజయవాడకు తిరుపతి సహా ఎనిమిది జిల్లాలకు ప్రతినిధ్యం లేకపోవడం దారుణమని అన్నారు. దీని లాగానే కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఆదరాబాదరాగా చేసిన ప్రక్రియ అని ఆయన దుయ్యబెట్టారు.
బీసీల విషయానికి వస్తే ఎన్నికలకు రెండేళ్ళ ముందు మంత్రులుగా వారిని తీసుకుంటే నమ్ముతారా అని గంటా నిలదీయడం విశేషం. బీసీలు టీడీపీకి ఎపుడూ అండగా ఉంటారని ఆయన అన్నారు. టీడీపీ నుంచి బీసీలను విడదీయలేరని ఆయన గట్టిగా చెప్పుకొచ్చారు. .ముఖ్యమంత్రి జగన్ విద్యా శాఖ మీద సమీక్ష చేస్తే విద్యా మంత్రి రాకపోవడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు
ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సహా సీనియర్లు అంతా టీడీపీలోకి వస్తారని గంటా సంచలన కామెంట్స్ చేశారు.
ఇక ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచి పొత్తులు, సర్దుబాట్లు ఉంటాయని గంటా వెల్లడించారు. తమ నాయకుడు చంద్రబాబు త్వరలో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి కార్యచరణను ప్రకటిస్తారు అని గంటా చెప్పారు. ఏది ఏమైనా జగన్ వెరీ వీక్ లీడర్ అని గంటా చెప్పడం అంటే ఆలోచించాల్సిందే మరి.