Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టు తీర్పుల‌పై ధ‌ర్మాన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   24 March 2022 10:30 AM GMT
ఏపీ హైకోర్టు తీర్పుల‌పై ధ‌ర్మాన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
రాష్ట్ర రాజ‌ధాని విష‌యంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులపై ఏపీ అసెంబ్లీలో చ‌ర్చ సాగుతోంది. ఈ సంద ర్భంగా వైసీపీ కీల‌క‌నాయ‌కుడు.. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ.. జ్యూడిషియల్‌ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని చెప్పిందని తెలిపారు.

ఏపీ అసెంబ్లీలో పాలనా విభజనపై ఆయన మాట్లాడుతూ..'అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. సమాజం పట్ల‌ పూర్తి బాధ్యత ఉందని సుప్రీంకోర్టు గతంలో ప్రకటించింది.

"ఒకవేశ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే అది ప్రజలు చూసుకుంటారు. అంతే కానీ శాసన వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పింది." అన్నారు. రాజ్యాంగంలోని మూడు వ్యవ స్థల పరిధి ఎంత మేరకు అన్నది కోర్టులో చెప్పాలి. ఎంత నిగ్రహంతో కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తు పెట్టు కోవాలని గ‌తంలో సుప్రీం కోర్టు చెప్పింద‌న్నారు.

సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు కూడా ఉన్నాయని సుప్రీం కోర్టు చెప్పింద‌న్నారు. న్యాయ వ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని తీర్పులు ఎన్నో చెప్పాయని తెలిపారు.

న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదే అని చెప్పాయని వివ‌రించారు. లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేవని సుప్రీం తీర్పుల్లో స్పష్టంగా ఉంది అని ధ‌ర్మాన వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు ప‌లు సంద‌ర్భాల్లో వెలువ‌రించిన తీర్పుల‌ను ధ‌ర్మాన ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు.

ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలి. సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు కూడా ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని త తీర్పులు ఎన్నో చెప్పాయి. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదే అని చెప్పాయి. లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేవని సుప్రీం తీర్పుల్లో స్పష్టంగా ఉంది' అని ధర్మాన తెలిపారు