Begin typing your search above and press return to search.
బట్టేబాజ్.. లుచ్చాగాడు.. తిట్లను ఇలా కూడా తిట్టొచ్చా కేటీఆర్?
By: Tupaki Desk | 21 April 2022 4:28 AM GMTజుట్టున్నమ్మ ఎలాంటి కొప్పు అయినా పెడుతుందన్న సామెతకు తగ్గట్లే.. మాట్లాడటం వచ్చినోడికి.. తన అవసరానికి తగ్గట్లుగా మాటల్ని ఎలా అయినా ట్విస్టు చేసే సామర్థ్యం ఉంటుంది. యావత్ దేశంలో ప్రధాని మోడీని ఉద్దేశించి ఘాటుగా.. దారుణంగా తిట్టటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. ఆ రికార్డును బ్రేక్ చేసే ప్రయత్నాన్ని చేశారు మంత్రి కేటీఆర్. ఒక రాష్ట్ర మంత్రి హదాలో ఉన్న ఆయన దేశ ప్రధానిని.. తిట్టకనే తిట్టినట్లుగా అనిపించేలా మాటలు అనే కొత్త కళను కేటీఆర్ తెర మీదకు తీసుకొచ్చారన్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో రాష్ట్ర అధికారపక్షానికి.. కేంద్రంలోని మోడీ సర్కారుకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు తప్పు మీదంటే మీదన్నట్లుగా మాటలతో విరుచుకుపడటం ఈ మధ్యన చూస్తున్నాం.
ఇప్పటివరకు జరిగిన తిట్ల పర్వాన్ని కొత్త తరహాకు తీసుకెళ్లిన ఘనత మాత్రం కచ్ఛితంగా కేటీఆర్ కు దక్కుతుందని చెప్పాలి. తాజాగా వరంగల్ పట్టణానికి వచ్చిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలను తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
మిగిలిన వారిని పక్కన పెడితే దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను తెచ్చిన వ్యక్తి అని మరిచిపోయిండ్రు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాకు మాట్లాడడం రాదా? మాకు రావా బూతులు. మోదీని ఏమిరా.. రారా పోరా.. అనరాదా. అమిత్ షాను అనరాదా.
మోదీ బట్టేబాజ్‌గాడు అనరాదా. లుచ్చాగాడు అనరాదా? కానీ, అనడం లేదు. అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం. నాలుక వాడుడు మొదలు పెడితే మాకంటే బాగా ఎవడూ మాట్లాడలేడు" అంటూ విరుచుకుపడ్డారు. అనాల్సిన మాటల్ని అనేస్తూనే.. ఇలాంటి మాటల్ని మేం అనటం లేదంటూ చెబుతున్న తీరు వెనుక అసలు విషయం అందరికి తెలిసిందే.
తాము వయసుకు.. హోదాకు మర్యాద ఇస్తామని నీతులు చెప్పే మంత్రి కేటీఆర్.. దేశ ప్రధానిని ఉద్దేశించి ఆ తరహా మాటల్ని అనేయాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? మంత్రి చెప్పే నీతులకు.. ఆయన మాటలకు ఎక్కడా పోలిక లేదన్న మాట రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏమైనా.. ప్రధాని మోడీని ఒక రాష్ట్ర మంత్రి ఈ స్థాయిలో విరుచుకుపడిన క్రెడిట్ కేటీఆర్ సొంతమని చెప్పాలి. మరి.. ఈ వ్యాఖ్యలకు కమలనాథులు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.