Begin typing your search above and press return to search.

పెళ్లికి నో చెప్పారని.. ప్రేయసిని ఏ ప్రేమికుడు చేయనిది చేశాడు

By:  Tupaki Desk   |   26 April 2022 4:30 AM GMT
పెళ్లికి నో చెప్పారని.. ప్రేయసిని ఏ ప్రేమికుడు చేయనిది చేశాడు
X
ప్రపంచంలో అత్యంత పవిత్రమైనది ప్రేమ అన్న మాటలు డెబ్బైలలోనో.. ఎనభైలలో.. ఆ మాటకు వస్తే తొంభైలలోనూ కాస్త నడిచింది. ఎప్పుడొచ్చిందో కానీ పాటు 2000.. అప్పటి నుంచి లవ్ లెక్కలే మారిపోయాయి. ప్రేమించిన వారు దూరమైతే తనను తాను శిక్షించుకోవటం.. కుమిలిపోవటం లాంటివి చేసుకునే వారు.

అందుకు భిన్నంగా తన ప్రేమకు ఒప్పుకోనున్నా.. ప్రేమించకున్నా.. ప్రేమించినా పెళ్లికి నో చెబితే చాలు.. రాక్షసంగా వ్యవహరించే తీరు గడిచిన కొంతకాలంగా ఎక్కువైంది. ప్రేమ ప్రాణాలు తీస్తుందన్న కొత్త కాన్సెప్టులు ఈ మధ్యన ఎక్కువైంది. తాజా ఉదంతం చూస్తే.. మనుషులు ఎంత దారుణంగా మారిపోతున్నారన్న భయాన్ని కలిగించేలా మారింది చెప్పక తప్పదు.

కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన ఒక ప్రేమికుడు తన పుట్టిన రోజు అని చెప్పి ప్రియురాలిని ఇంటికి పిలిచాడు. ప్రేమించినోడి పుట్టినరోజు కావటంతో ప్రేమికుడి ఇంటికి వచ్చింది. నమ్మి వచ్చిన ప్రేమికురాలిని తన గదిలోకి తీసుకెళ్లి.. ఆమెకు నిప్పు పెట్టేసి.. తాను నిప్పు పెట్టేసుకున్నాడు.

తీవ్ర గాయాలైన ఇద్దరిని త్రిశూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎందుకిలా అంటే.. 23 ఏళ్ల బాలసుబ్రమణియం తనకంటే ఏడేళ్లు చిన్నదైన 16 ఏళ్ల బాలికను ప్రేమించాడు.

అయితే.. వీరి ప్రేమకు ఇరుకుటుంబాలకు చెందిన పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో.. తనకు దక్కని తన ప్రియురాలు మరెవరికీ దక్కకూడదనుకున్నాడో ఏమో కానీ.. తన పుట్టిన రోజు వేడుక ఉందని తమ ఇంటికి రావాలని కోరటంతో ఆమె వచ్చింది. ఆ సమయంలో బాలసుబ్రమణియం తల్లి.. తమ్ముడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. తన గదికి తీసుకెళ్లి ఆమెకు నిప్పు అంటించాడు.

తర్వాత తనకు తాను నిప్పు అంటించుకున్నాడు. గది నుంచి పెద్ద ఎత్తున కేకలు రావటంతో అలెర్టు అయి.. అంబులెన్సులో ఇద్దరిని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇరువురు మరణించారు. ముందుగా ప్లాన్ వేసుకొనే ఇదంతా చేసి ఉంటారని భావిస్తున్నారు.