Begin typing your search above and press return to search.
అందరి ఫ్యూచర్ పీకే డిసైడ్ చేస్తే... ఆయన ప్యూచర్ డిసైడ్ చేసిన కేసీఆర్
By: Tupaki Desk | 28 April 2022 1:30 AM GMTరాజకీయాల్లో ఎప్పుడూ లెక్కలు ఒకేలాగా ఉండవు. సమయానుకూలంగా మారుతూనే ఉంటాయి. గత కొద్దికాలంగా వార్తల్లో వ్యక్తిగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ముఖ్యులతో పీకే చర్చలు జరపడం, కాంగ్రెస్లో చేరాలని సోనియా గాంధీ ఆఫర్ ఇవ్వడం తెలిసిన సంగతే. అయితే, ఆఫర్ తిరస్కరించిన పీకే కాంగ్రెస్కు దూరమయ్యారు.
ఈ విషయాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్సుర్జేవాలా ట్వీట్ చేయగా... కొద్ది నిమిషాలకే పీకే దీన్ని ధ్రువీకరించారు. వెనువెంటనే జరిగిన ఈ పరిణామాల వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం ఉందంటున్నారు.
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో పీకే మూడు సార్లు సమావేశం అవడం, అనంతరం ఆయన పార్టీలో చేరనున్నట్లు ఢిల్లీ పెద్దలు చెప్పడంతో ఇక పీకే కండువా కప్పుకోవడమే లేట్ అన్నట్లు చర్చ జరిగింది. అయితే, హఠాత్తుగా శనివారం రాష్ట్రానికి వచ్చిన ప్రశాంత్ కిశోర్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉన్న ఆయన సీఎం ఫామ్హౌస్కు కూడా వెళ్లి చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల కోసం టీఆర్ఎస్ తరఫున తన ఐప్యాక్ సంస్థ పని చేస్తుందని, తాను కాంగ్రెస్లో చేరబోతున్నానని చెప్పడానికే వచ్చారని అంతా నమ్మారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఐప్యాక్ తమ పార్టీ కోసం పని చేస్తుందని మీడియాకు తెలిపారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరబోయే పీకే టీఆర్ఎస్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకే వచ్చారన్నారు. ఈ చర్చంతా ఇంకా హాట్హాట్గా కొనసాగుతూ ఉండగానే పీకే తాను కాంగ్రెస్‌లో చేరట్లేదని ప్రకటించేశారు.
చర్చలు పూర్తయ్యాయని, పీకే కాంగ్రెస్లో చేరే ఉద్దేశంతోనే ఉన్నారని అధికారికంగా కూడా వెల్లడయిన సమయంలో ఇలా జరిగిన పరిణామాల వెనుక ఖచ్చితంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఉందని అంటున్నారు. కేసీఆర్తో రెండు రోజుల పాటు జరిగిన చర్చల ప్రభావం ఆయనపై తప్పకుండా పడి ఉంటుందని సీనియర్ విశ్లేషకుల మాట.
కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీలోని సీనియర్ల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందే తప్ప సొంత నిర్ణయాలను లెక్కలోకి తీసుకోబోరని, తద్వారా మీ ప్రభావాన్ని కోల్పోవాల్సి వస్తుందనే మాటను పీకేకే కేసీఆర్ చెప్పి ఉంటారని భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇంత పేరు పొందిన తర్వాత ఒక పార్టీ నేతగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఎందుకన్న విశ్లేషణ కూడా కేసీఆర్ చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా పలువురు కీలక నేతల ఫ్యూచర్ పీకే డిసైడ్ చేస్తే... ఆయన ప్యూచర్ కేసీఆర్ డిసైడ్ చేశారని కామెంట్లు చేస్తున్నారు.