Begin typing your search above and press return to search.

టీడీపీ యువజపం.. దారినప‌డిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   30 March 2022 11:30 PM GMT
టీడీపీ యువజపం.. దారినప‌డిన‌ట్టేనా?
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ యువ సంక‌ల్పం చేసుకుంది. 40వ పార్టీ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ అధి నేత చంద్ర‌బాబు.. పార్టీని యువ‌త‌రం బాట ప‌ట్టిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇది మంచి ప‌రిణామ‌మే. ఎందుకం టే.. ఇత‌ర పార్టీల‌ను చూసుకుంటే.. యువ‌త‌రం ప‌రిఢ‌విల్లుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వైసీపీ కానీ, జ‌న‌సేన కానీ.. యువత‌రంతో నిండి క‌నిపిస్తున్నాయి. అలాగ‌ని.. టీడీపీని తీసేయాల్సిన అవ‌స‌రం లేదు. ఈ పార్టీలో కూడా.. యువ‌త సంఖ్య‌కు కొద‌వ లేదు. దాదాపు 30 శాతానికి పైగా 30 ఏళ్ల‌లోపు ఉన్న యువ‌కులు, యువ‌తే.. పార్టీలో ఉన్నార‌ని లెక్క‌లు చెబుతున్నాయి.

ఇక‌, 40-55 మ‌ధ్య వ‌య‌సు ఉన్న నాయ‌కులు 40 శాతానికి పైగానే ఉన్నారు. ఇక‌, 50-70 ఏళ్ల మ‌ధ్య ఉన్న సీని య‌ర్లు..30 శాతానికి ఉన్నారు. ఇలా.. ఏవ‌య‌సు వారిని చూసుకున్నా.. యువ‌త సంఖ్య ఎక్కువ‌గా ఉంది. అయితే. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో మాత్రం.. సీనియ‌ర్ల‌ది అంటే.. 50-70 ఏళ్ల మ‌ధ్య ఉన్న‌వారి హ‌వానే చెలామ‌ణి అవుతోందనే టాక్ ఉంది.

మిగిలిన వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న కూడా ఉంది. ముఖ్యంగా 35 ఏళ్ల‌లోపు వారిని ప్ర‌చారానికి.. ఇత‌రత్రా వాడుకుంటున్నార‌ని.. వారికి ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే వాద‌న ఒకానొక ద‌శ‌లో పార్టీని కుదిపేసింది.

గ‌త ఎన్నిక‌ల్లోనూ ఈ విష‌యం పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే.. ఆ మ‌ధ్య కాలంలో చంద్ర‌బాబు కొంత త‌న వ్యూహం ప్ర‌కారం.. 33 శాతం యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తాన‌ని.. పార్టీలో ప‌ద‌వుల‌తోపాటు.. ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తాన‌ని... చెప్పి.. ఏడాదిన్న‌ర అయిపోయింది. అయితే. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఈ దిశ‌గా అడుగులు వేసింది లేదు.

దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి. యువ‌త‌రం ఆర్థికంగా బ‌లంగా లేక పోవ‌డం.. ప్ర‌త్య‌ర్థిపార్టీల నుంచి వ‌చ్చే పోటీని త‌ట్టుకుంటారో.. లేదో అనే విషయంపై కొంత త‌ర్జ‌న‌భ‌ర్జన సాగుతుండ‌డం వంటివి.. పార్టీలో యువ‌త‌కు ప్రాధాన్యం త‌గ్గించింది.

అయితే.. ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఉన్న‌ప్ప‌టికీ.. యువ‌త‌కు 40 శాతం ప్రాధాన్యం ఇస్తామ‌ని.. చంద్ర‌బా బు అన్నారు. అంటే.. దీనిని బ‌ట్టి.. ఏకంగా రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ సీట్ల‌లో 70 స్థానాల‌ను యువ‌త‌కే కేటాయించాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న గుర్తించారు. గత ఎన్నిక‌ల్లో వైసీపీ కూడా ఇదే ఫార్ములాఅమ‌లు చేసింది. 175 నియోజ‌క‌వ్గాల్లో 100 స్థానాల్లో యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఇది బాగానే వ‌ర్కవుట్ అయింది. ఈ నేప‌థ్యంలో.. చంద్ర‌బాబు వ్యూహం కూడా ఫ‌లిస్తుంద‌ని.. అనుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.