Begin typing your search above and press return to search.
హెచ్ 1బీ వీసా.. లేటెస్ట్ అప్డేట్
By: Tupaki Desk | 23 Dec 2021 5:30 AM GMTభారత టెకీలకు బ్యాడ్ న్యూస్. డాలర్ కల సాకారానికి రాచమార్గమైన హెచ్ 1బీ వీసా జారీకి కొత్త విధానంలో కాకుండా పాత పద్దతిలోనే కంటిన్యూ చేయాలని అమెరికా నిర్ణయం తీసుకోవటమే దీనికి కారణం. ప్రతి ఏడాది 85 వేల మందికి హెచ్ 1బీ వీసాల్ని జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ కోటా 65 వేలే అయినప్పటికి.. అమెరికా విశ్వవిద్యాలయాల్లో పీజీ.. ఆ పై కోర్సులు చేసిన వారి కోసం అదనంగా 20వేల వీసాల్ని జారీ చేయాలని నిర్ణయించటం తెలిసిందే. నిర్ణీత కోటాకు మించి దరఖాస్తులు వస్తే.. అర్హులైన వారి ఎంపిక కోసం లాటరీ విధానాన్ని అనుసరించే వారు.
అయితే.. ట్రంప్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా లాటరీ పద్దతిలో కాకుండా అత్యధిక వేతనాలు పొందే వారికే తొలి ప్రాధాన్యతను ఇచ్చేలా మార్పు చేశారు. 2022 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని భావించారు. తాజాగా బైడెన్ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది సైతం అత్యధిక వేతనాలు పొందే వారికి ప్రాధాన్యతను ఇస్తూ.. వీసాలుజారీ చేసే విధానానికి భిన్నంగా.. పాత పద్దతి అయిన లాటరీ విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరానికి అమెరికా సిటిజన్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఇందులో అత్యంత ప్రతిభావంతులైన వృత్తి నిపుణులనే అమెరికాలోకి అనుమతించాలన్న ఉద్దేశంతో ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన కొత్త విధానాన్ని ఈసారి అమలు చేయకూడదని నిర్ణయించారు. దీనికి కారణం.. వేతనాల ఆధారంగా వీసా కేటాయింపును కాలిఫోర్నియా నార్త్ కోర్టు కొట్టేయటంతో ఈసారికి లాటరీ విధానాన్నే అమలు చేయాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది.
లాటరీ విధానానికి బదులుగా.. అత్యధిక వేతనాల ఆధారంగా వీసాల్ని జారీ చేయాలన్న నిర్ణయాన్ని అమలు చేసి ఉంటే.. భారత టెకీలు అత్యధికంగా లాభపడేవారు. ఎందుకంటే.. ఎక్కువ జీతాలకు మన టెకీలకే ఎక్కువగా ఉ:టుంది. అందుకు భిన్నంగా లాటరీ పద్దతిని ఫాలో కావటం వల్ల పలువురు అవకాశాలు మిస్ అయ్యే పరిస్థితి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.