Begin typing your search above and press return to search.

అయన 'దేవుడు' .. మా కొడుకు హత్య చేయడమేంటి ?

By:  Tupaki Desk   |   10 Aug 2021 5:18 AM GMT
అయన దేవుడు .. మా కొడుకు హత్య చేయడమేంటి ?
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ , రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు అనుమానితుల్లో ఒకరైన వైకాపా కార్యకర్త యాదటి సునీల్‌ యాదవ్‌ ను సీబీఐ అరెస్టు చేయడంపై తండ్రి కృష్ణయ్య తాజాగా స్పందించారు. వివేవానంద రెడ్డి మాకు దేవుడి లాంటి వారని, ఆయనతో తన కుమారుడు సన్నిహితంగా మెలిగింది నిజమే అని అన్నారు. అలాగే , వివేకానందరెడ్డి మా ఇంటికి రెండు సార్లు వచ్చి వెళ్లారు. అలాంటి మంచి వ్యక్తిని నా కుమారుడు హత్య చేశాడనడం అవాస్తవం. కాపాలాదారు రంగయ్య చేసిన ఆరోపణల్లో అసలు సత్యం లేదని అన్నారు.

అయన ఆరోపణల్లో నిజం ఉంటే .. హత్య జరిగి రెండున్నర ఏళ్లుగా నోరు విప్పని రంగయ్య ఈ రోజే ఎందుకు చెప్పాడు?'' అని కృష్ణయ్య ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న సునీల్‌ యాదవ్‌ ను గత సోమవారం రాత్రి గోవాలో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం మంగళవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ కు తీసుకొచ్చి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత సునీల్‌ యాదవ్‌ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.

ఈ ఏడాది మార్చిలో అతన్ని దిల్లీ పిలిపించి కొన్ని రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు సునీల్‌ యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలోని వారి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. సునీల్‌ యాదవ్‌ కోసం గాలిస్తున్న సీబీఐ అధికారులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న సునీల్‌ యాదవ్‌ను గత సోమవారం రాత్రి గోవాలో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం మంగళవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత సునీల్‌ యాదవ్‌ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.

ఈ ఏడాది మార్చిలో అతన్ని దిల్లీ పిలిపించి కొన్ని రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు సునీల్‌ యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలోని వారి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. సునీల్‌ యాదవ్‌ కోసం గాలిస్తున్న సీబీఐ అధికారులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా పులివెందుల రోటరీపురం, గుర్రాలగడ్డ వంకలో సీబీఐ ఆయుధాల కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికీ వాటి ఆచూకీ లభించలేదు. రేపు కూడా గాలింపు కొనసాగుతుందని సీబీఐ అధికారులు వెల్లడించారు. రెండు నెల‌లుగా సాగుతున్న సీబీఐ విచార‌ణ‌కు ముగింపు త్వరలో దొరుకుతుందని అందరూ భావిస్తున్నారు.