Begin typing your search above and press return to search.
ఆనం భుజంపై తుపాకీ.. రిజల్ట్ కోసం.. ఎదురు చూస్తున్న నేతలు
By: Tupaki Desk | 1 March 2022 4:30 PM GMTరాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నారు. ఉగాది నుంచే పాలన చేస్తామని.. ప్రకటించేశార కూడా! అయితే.. ఈ ప్రకటన అధికార వైసీపీలోని కొందరు నేతలకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు మరో 13 జిల్లాలను జోడించి.. 26 రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ ప్రభుత్వమే ప్రకటించింది.
ప్రతి పార్లమెంటు స్థానాన్ని ఒక జిల్లాగా మారుస్తామని.. ఎన్నికలకు ముందు చేసిన ప్రకటన మేరకు ఇప్పుడు ఆదిశగా అడుగులు వేసింది. అయితే.. ఈ క్రమంలో కొన్ని జల్లాల రూపు రేఖలు హద్దులు కూడా మారిపోనున్నాయి. దీంతో ఇప్పుడున్న జిల్లాల్లో మంచి పట్టు, పేరు ఉన్న నాయకులు తల్లడిల్లుతున్నారు.
ఇలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. . ప్రస్తుతం జరిగిన జిల్లాల విభజనలో వెంకటగిరి నియోజకవర్గం పూర్తిగా శ్రీబాలాజీ జిల్లాలోకి వెళ్లిపోనుంది. చిత్తూరు జిల్లాలోని నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలతో చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. అదేసమయంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీజిల్లా ఏర్పాటు చేయనున్నారు.
అంటే.. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీబాలాజీ జిల్లా ఇక నుంచి రాయలసీమ ప్రాంతంంలో చేరిపోతుంది. ఇదే ఇప్పుడు ఈయనకు ఇబ్బందిగా మారింది. దశాబ్దాలుగా ఆనం కుటుంబం.. నెల్లూరులో చక్రం తిప్పుతోంది. మంత్రి అయినా.. ఎమ్మెల్యే అయినా.. ఆయనకు నెల్లూరుతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీబాలాజీ జిల్లాలో కొనసాగడం అంటే..కష్టమే. ఇటు రాజకీయంగాను,, అటు సన్నిహిత వర్గాల పరంగానూ.. ఆయనకు ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి నెల్లూరు నాయకుడిగానే కొనసాగాలని భావిస్తున్నారు.
అదేవిధంగా నగరి ఎమ్మెల్యే రోజా, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు(ఈయన మౌనంగా ఉన్నా.. సెగ మాత్రం తప్పడం లేదు), నూజివీడు ఎమ్మెల్యే ఇలా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు.. తమ అధికార పరిధి మారిపోతుందని.. ఇప్పటి వరకు ఉన్న జిల్లాల్లో ప్రభావం పూర్తిగాతుడిచి పెట్టుకుపోతే.. ఎలా అనేది ఆవేదన . అయితే.. ఆనం ఒక్కరు మాత్రమే తన స్వరం వినిపించారు. మిగిలిన వారు కూడా ఇదే తరహా ఆలోచనతో ఉన్నారు.
అయితే.. అధిష్టానం నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆనం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధిష్టానం రియాక్షన్ చూసి.. స్పందించాలని నిర్ణయించుకున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.