Begin typing your search above and press return to search.

‘రామసేతు’ విచారణకు సుప్రీం ఓకే.. విచారణ ఎవరి బెంచ్ ముందుకంటే?

By:  Tupaki Desk   |   24 Feb 2022 5:55 AM GMT
‘రామసేతు’ విచారణకు సుప్రీం ఓకే.. విచారణ ఎవరి బెంచ్ ముందుకంటే?
X
రామసేతు అంశంపై విచారణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. రామసేతును జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను విచారణ జరిపేందుకు సుప్రీం పచ్చజెండా ఊపింది. రామసేతు వివాదం సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ అంశంపైనా విచారణ చేస్తామని సుప్రీం పేర్కొంది. రామసేతును ఆడమ్స్ బ్రిడ్జిగా పేర్కొనటం తెలిసిందే.

సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను మార్చి 9 నుంచి చేసేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు సుప్రీం వెల్లడించింది.

గతంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం రామసేతు నిర్మాణాన్ని ధ్వంసం చేసి షిప్ చానల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించటం.. ఆ సందర్భంగా రామసేతును ధ్వంసం చేయటం కుదరదంటూ నాటి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టేవారు సుబ్రమణ్య స్వామి. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వ తీరును బీజేపీ సైతం వ్యతిరేకించింది.

ఇక.. ఈ వివాదానికి వస్తే తమిళనాడులోని రామేశ్వర ద్వీపం.. శ్రీలంక వాయువ్య తీరం.. మన్నార్ ద్వీపం మధ్యలో ఉన్న సున్నపురాయి నిర్మాణాన్ని రామసేతు బ్రిడ్జిగా వ్యవహరిస్తారు. రామసేను వానర సేనతో శ్రీరామచంద్రుడే నిర్మించినట్లుగా పురాణాల్లో పేర్కొనటం తెలిసిందే. ఇదే అంశాన్ని హిందువులు.. హిందూ సంస్థలు వాదనలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఈ పిటిషన్ గత ఏడాదిలోనే సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అప్పట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ ఎస్ఏ బోబ్డే స్పందిస్తూ.. తన తర్వాత సీజేఐ గా బాధ్యతలు చేపట్టే జస్టిస్ ఎన్వీ రమణ చేపడతాని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రామసేతుపై నెలకొన్న వివాదం తెలిసిందే. కొందరు రామసేతును టచ్ చేస్తే ఊరుకునేది లేదని పలు పార్టీలు హెచ్చరించారు.

మరికొందరు ఇందుకు విరుద్ధంగా రామసేతు ఉంటే ఎంత? లేకుంటే ఎంతన్నట్లుగా కూడా వాదనలు వినిపించారు. త్వరలో ఈ అంశంపై విచారణకు సుప్రీం చేపట్టటం.. దానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాదనలు వినటంతో.. ఈ వివాదంపై త్వరలోనే ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే సుదీర్ఘంగా నలుగుతున్న రామసేతు వ్యవహారం ఒక కొలిక్కి రావటం ఖాయమని చెప్పక తప్పద.