Begin typing your search above and press return to search.
వికేంద్రీకరణ విషయంలో బల్ల గుద్దుతున్న బొత్స...?
By: Tupaki Desk | 5 March 2022 1:43 PM GMTవైసీపీలో కీలక మంత్రి బొత్స సత్యనారాయణ గత మూడు రోజులుగా అదే మూడ్ లో ఉన్నారు. ఒకే పాట పాడుతున్నారు. మూడు రాజధానుల మీద మేము వెనక్కి తగ్గేది లేదు అని కూడా అంటున్నారు. అమరావతి రాజధాని మీద హై కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో బొత్స ఇప్పటికి పలుమార్లు మీడియాతో ముచ్చటించారు. తాజాగా మరోసారి ఆయన మీడియా ముందుకు వచ్చి మూడు రాజధానుల విషయంలో తగ్గేదే ల అంటూ పుష్ప హీరో స్టైల్ లో చెప్పేశారు.
ఒక వైపు రాజధాని చట్టం లో మార్పు చేర్పులు చేసే అధికారం శాసన సభకు లేదని కోర్టు తీర్పు వెలువరించిన క్రమంలో ప్రభుత్వ ప్రతినిధిగా బొత్స పదే పదే మూడు రాజధానుల మాట ఎందుకు అంటున్నారు అన్నదే చర్చగా ఉంది. ఇదిలా ఉంటే ఈ విషయంలో ప్రభుత్వ వ్యూహం ఏంటి అన్నదే ఎవరికీ తెలియడంలేదు.
ఇక శాసన సభ సమావేశాలు ఈ నెల 7 నుంచి మొదలు కానున్నాయి. నిజానికి ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లుని మరో సారి ప్రవేశపెడతారు అన్న ప్రచారం అయితే ఇప్పటిదాకా జరిగింది. అదే టైమ్ లో హై కోర్టు తీర్పు రావడంతో ఆ ప్రతిపాదన ఉంటుందా లేక విరమించుకున్నారా అన్నది కూడా తెలియడంలేదు. ఇంకో వైపు ప్రభుత్వం న్యాయ నిపుణులతో హై కోర్టు తీర్పును చర్చించింది అని తెలుస్తోంది.
ఈ విషయం మీద సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం లేదని కూడా అంటున్నారు. వేరే ప్రత్యామ్యాయాలను చూసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే అవేంటి అన్నదే ఎవరికీ తెలియడంలేదు. బొత్స మాటలలో చాలా చెప్పారు.
శివరమ క్రిష్ణన్ కమిషన్ అధికార వికేంద్రీకరణ గురించి చెప్పిన సంగతిని గుర్తు చేశారు. అదే విధంగా తమకు కేవలం అమరావతి మాత్రమే కాదు, పదమూడు జిల్లాలూ ముఖ్యమే అన్నారు. మొత్త్తానికి బొత్స మాటలను బట్టి చూస్తే సర్కార్ మూడు మీద గట్టిగానే పట్టుదలగా ఉందని తోస్తోంది.
మరి శాసనసభ సమావేశాల్లోనే దీని మీద ఫుల్ క్లారిటీ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో ఏదో చేయాలనుకుంటోందని స్పష్టం అవుతోంది. వికేంద్రీకరణ విషయంలో ఏం చేయాలో అదే చేస్తామని మంత్రి బొత్స మాటలు అయితే ఇపుడు ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. మరి బొత్స ఏం చేస్తారు, ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేయబోతోంది అన్నది తెలియాలంటే అసెంబ్లీ స్టార్ట్ కావాల్సిందే.