Begin typing your search above and press return to search.
ఏపీలో రుణానంద లహరి.. ఆర్ ఆర్ ఆర్ కామెంట్స్
By: Tupaki Desk | 28 Feb 2022 10:35 AM GMTఏపీలో ప్రస్తుతం రుణానంద లహరి నడుస్తోందని వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ అన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఏపీకి ఆర్థిక ఇబ్బందు లు రాబోతున్నాయన్నారు.
ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కి అప్పులు తీసుకునే అనుమతి లేదని, బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆస్తులు తనఖా పెట్టి.. మళ్లీ కొత్త అప్పులు చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. అభివృద్ధిలేని అప్పు.. ప్రజలకు శాపంగా మారుతుందని చెప్పారు.
అప్పులు ఎన్ని తీసుకొచ్చి పథకాలు ఇచ్చినా పర్లేదు కానీ.. అసలు తీసుకొచ్చిన అప్పులు ఏమౌతున్నాయ ని ఆయన ప్రశ్నించారు. జగనన్న తోడుకు ఇచ్చే నిధులు తక్కువ.. ప్రకటనలు ఎక్కువని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు.. ప్రయత్నం చేస్తున్నారనే వార్తలొస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు. దీనికి ప్రధాన కారణం..అప్పులేనని చెప్పారు.ఇప్పటికే శక్తికి మించి అప్పులు చేసిన జగన్ ప్రభు త్వం వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఏపీకి కేంద్రం మళ్లీ అప్పులు ఇచ్చే అవకాశంఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. మార్చి 31తో అయిపోతుందని.. తర్వాత.. వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా.. ఏపీకి కూడా అప్పులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. అయితే.. ఈ అప్పులు కూడా ఈ ఏడాది అక్టోబరు వరకు మాత్రం పనిచేస్తాయని.. తర్వాత.. మళ్లీ ఖజానా ఖాళీ అయిపోతుందని... ఇక, దిక్కుతోచని స్థితిలో ఏపీప్రబుత్వం ఎన్నికలకు వెళ్లి.. తర్వాత జరిగేది తర్వాత చూసుకుందాం ...అనే ధోరణిని ప్రదర్శించే అవకాశం ఉందని రఘురామ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అప్పుల ననుంచి ఏపీ ప్రబుత్వం బయటపడే అవకాశం లేదని.. రఘురామ చెప్పారు. ఈ క్రమంలో సర్కారు సర్వైవ్ అయ్యేందుకు..రెండు మార్చాలను ఎంచుకుందని ఆయన చెప్పారు.
ఒకటి మరింతగా ప్రజలపై పన్నులు వేయడం.. రెండు ఇప్పుడు అమలు జరుగుతున్న అమ్మ ఒడి వంటి భారీ ఆర్థిక ప్రయోజనం ఉన్న పథకాలను అటకెక్కించడమని.. వివరించారు. అయినప్పటికీ.. అక్టోబరు వరకే ప్రభుత్వం మనుగడ ఉంటుందని.. తర్వాత.. కష్టమేనని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.