Begin typing your search above and press return to search.

ఏజ్ బార్ బ్యాచ్ సైకిల్ దిగాల్సిందే... ?

By:  Tupaki Desk   |   28 Feb 2022 4:30 PM GMT
ఏజ్ బార్ బ్యాచ్ సైకిల్ దిగాల్సిందే... ?
X
ఏజ్ బార్ అయితే ఇక డిబారే. అది ఉగ్యోగాలలోనే కాదు, ఇపుడు రాజకీయాల్లో కూడా. ఇంతకాలం షష్టి పూర్తి అయిన వారు కూడా పొలిటికల్ గా నవ యువకులుగా చలామణీ అయిపోతూ వచ్చారు. అనుభవం, సీనియారిటీ లాంటి ఎగస్ట్రా క్వాలిఫికేషన్స్ వెంటేసుకుని టికెట్లు సాధించేవారు. కానీ ఈసారి అలా కాదు అని టీడీపీ హై కమాండ్ అంటోంది. ఏజ్ బార్ అయితే నో చాన్స్ అని కూడా స్వీట్ వార్నింగ్ ఇస్తోంది.

మీ సేవలు పార్టీకి అవసరమే కానీ ఎన్నికల్లో పోటీకి మాత్రం ఏజ్ ఎక్కువ అయితే ఒప్పుకోను అని పారామీటర్ పెట్టి మరీ పక్కకు తప్పుకోమంటున్నారు. ఆ విధంగా చూస్తే టీడీపీలో సీనియర్ల బాధ చెప్పనలవికానిదిగా ఉంది. కొత్త వారు రావాల్సిందే. మిడిల్ ఏజ్ వారు, యూత్ కే టికెట్లు అన్న లెక్కలేవో పెట్టుకుని బాబు ఒక్కో సీటు విషయంలో కధను రక్తి కట్టిస్తున్నారు అని చెబుతున్నారు.

కడప జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు రీసెంట్ గా ఫస్ట్ టికెట్ ని సీఎం జగన్ మీద పోటీకి అంటూ బీటెక్ రవి కి ఇచ్చారు. పులివెందులలో పులిలా దూకుడు చేయమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇపుడు అదే జిల్లాలోని పొద్దుటూరు నుంచి రెండవ టికెట్ కన్ ఫర్మ్ చేశారని ప్రచారం సాగుతోంది.

పొద్దుటూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఎం లింగారెడ్డికి ఈసారి చంద్రబాబు చెక్ చెప్పేశారు. అక్కడ పార్టీకి ఇంచార్జిగా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.

దీని మీద జరిగిన సమీక్ష సందర్భంగా లింగారెడ్డిని వయసుని దృష్టిలో పెట్టుకుని ప్రవీణ్ కి సహకరించాలని హై కమాండ్ కోరినట్లుగా చెబుతున్నారు. ప్రవీణ్ ని పొద్దుటూరు లో గెలిపించుకుని వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని లింగారెడ్డికి చెప్పారని టాక్.

ఇలా ఎక్కడికక్కడ ఏజ్ బార్ అయిన వారిని పార్టీకి సేవ చేస్తే ఫ్యూచర్ లో అవకాశాలు ఇస్తామని పార్టీ అధినాయకత్వం చెప్పుకుంటూ వస్తోంది. దీంతో సీనియర్లలో కలవరం రేగుతోంది. ఇలా అయితే కష్టమే అన్న వారూ ఉన్నారు. అదే టైమ్ లో యూత్ కి కొత్త వారికి చాన్స్ ఇస్తే పార్టీకి అదే సరికొత్త బలం అని తమ్ముళ్ళు అంటున్నారు. మొత్తానికి టీడీపీ తీసుకున్న ఈ స్టాండ్ పార్టీకి ఎలాంటి వైభవాన్ని తెస్తుందో చూడాల్సిందే.