Begin typing your search above and press return to search.

హర్భజన్ ను వదిలేసి ఆమ్ ఆద్మీపై పడ్డ సిద్ధూ

By:  Tupaki Desk   |   22 March 2022 6:37 AM GMT
హర్భజన్ ను వదిలేసి ఆమ్ ఆద్మీపై పడ్డ సిద్ధూ
X
కుమ్ములాటలతో పంజాబ్ లో అధికారాన్ని దూరం చేసుకొని ఆమ్ ఆద్మీ గెలుపునకు పరోక్షంగా సహకారం అందించింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా పంజాబ్ లో కాంగ్రెస్ కుదేలు కావడానికి కారణం నవజ్యోత్ సింగ్ సిద్ధూ అని ఆరోపణలున్నాయి. మొన్నటి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించి పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలోనే పంజాబ్ లో ఓటమికి పీసీసీ చీఫ్ గా ఉన్న సిద్దూ రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలోనే పంజాబ్ నుంచి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా ఐదుగురు సభ్యులను రాజ్యసభకు ఆమ్ ఆద్మీ పార్టీ నామినేట్ చేసింది. ఆప్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయినందుకు హర్భజన్ కు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత సిద్ధూ అభినందించడం విశేషం.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపికపై ట్విట్టర్ లో సిద్ధూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ రిమోట్ కంట్రోల్ కు కొత్త బ్యాటరీలంటూ ఎద్దేవా చేశారు. హర్భజన్ సింగ్ మినహా మిగిలిన రాజ్యసభ సభ్యుల ఎంపిక పంజాబ్ కు ద్రోహం చేయడమేనని ఆరోపించారు. తన ట్వీట్ ను ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ట్యాగ్ చేసి మరీ విమర్శలు గుప్పించారు.

ఆమ్ ఆద్మీపార్టీ రాజ్యసభ సభ్యుల ఎంపికపై సిద్ధూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని 10 జన్ పథ్ చేతిలో రిమోట్ కంట్రోల్ గా సిద్ధూ ఎద్దేవా చేశారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని సిద్ధూ ఖతం చేశారంటూ ఎద్దేవా చేశారు.ఆమ్ ఆద్మీ రాజ్యసభకు నామినేట్ అయిన అభ్యర్థులందరూ బారతీయులేనని.. మరి దీనిపై అభ్యంతరాలు ఎందుకని కొందరు ప్రశ్నించారు.

మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం సిద్ధూ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. పంజాబ్ ప్రజలు ఆమ్ కు అధికారం కట్టబెట్టారని.. ఐదుగురు సభ్యుల్లో కనీసం నలుగురిని పంజాబ్ నుంచి ఆప్ రాజ్యసభకు పంపి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపడాన్ని సిద్ధూ తీవ్రంగా విమర్శించారు.