Begin typing your search above and press return to search.

కృష్ణ కృష్ణా మళ్లీ జల వివాదం ? చిక్కుల్లో జగన్ !

By:  Tupaki Desk   |   24 March 2022 8:34 AM GMT
కృష్ణ కృష్ణా మళ్లీ జల వివాదం ? చిక్కుల్లో జగన్ !
X
ఏపీ స‌ర్కారు మ‌ళ్లీ జ‌ల వివాదంలో ఇరుక్కుంది.ఇప్ప‌టికే కృష్ణా జ‌లాల‌కు సంబంధించి ఏనాటి నుంచో నెల‌కొన్న ర‌గ‌డ మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. నీటి వినియోగానికి సంబంధించి పొరుగు రాష్ట్ర‌మ‌యిన తెలంగాణ‌తో వాటాలు లెక్కలు తేల‌క‌పోగా..ఎప్ప‌టి నుంచో ఉన్న పంప‌కాల‌తో పాటు ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన తెలంగాణ అభ్యంత‌రాలు కూడా అప‌రిష్కృతంగానే ఉన్నాయి. వాస్త‌వానికి కృష్ణా బేసిన్ ప‌రిధిలో ఉన్న ప్రాజెక్టుల‌న్నీ ఒక గెజిట్ తో కేంద్రం త‌న అధీనంలోకి తీసుకుంది.

ఇదే సంద‌ర్భంలో గోదావ‌రి జలాల విష‌య‌మై కూడా ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించింది. కేంద్ర ప‌రిధిలో కృష్ణాబోర్డు నిర్వ‌హించాలంటే అందుకు ఇరు రాష్ట్రాలూ ఎంతో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీనిని కూడా గ‌తంలో కేంద్రం నిర్ణ‌యించింది. ఇందుకు కూడా తెలంగాణ ఒప్పుకోవ‌డం లేదు. కృష్ణా జ‌లాల పంపిణీపై తెలంగాణ ఎప్పుడూ చెబుతున్న అభ్యంత‌రాలే చెబుతూ తాజాగా కొత్త ట్రైబ్యున‌ల్ కావాల‌ని కోరుతోంది. దీనిని కేంద్ర న్యాయ శాఖ త‌ప్పుబడుతోంది. కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ నుంచి కేంద్ర న్యాయ శాఖ‌కు సంబంధిత ప్ర‌తిపాద‌న‌లు వెళ్లాయి కానీ అవేవీ ఆమోదానికి నోచుకోలేదు స‌రిక‌దా! సంబంధిత వ‌ర్గాలు ఇచ్చిన తీర్పు తెలంగాణ‌కు చేదు అనుభ‌వాన్నే ఇచ్చింది. కృష్ణా జ‌లాల పంపిణీకి సంబంధించి కొత్త ట్రైబ్యున‌ల్ అవ‌స‌రం ఏమొచ్చింద‌ని జ‌ల్ శ‌క్తి శాఖ ను కేంద్ర న్యాయ శాఖ ప్ర‌శ్నించింది.

బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యున‌ల్ ప్ర‌కారం ఇరు రాష్ట్రాల‌కూ నీటి పంప‌కాల్లో వాటాలు ఎంత‌న్న‌వి తేలిపోగా అంత‌ర్రాష్ట జ‌ల వివాదాల చ‌ట్టం సెక్ష‌న్ 3 ప్ర‌కారం కొత్త ట్రైబ్యున‌ల్ ఏర్పాటుకు అవ‌స‌రం ఏమొచ్చింది అని ప్ర‌శ్నించింద‌ని ఇవాళ ప్ర‌ధాన మీడియా వెల్ల‌డి చేసింది.

కేసీఆర్ మాత్రం తమకు న్యాయంగా ద‌క్కాల్సిన నీటి వాటాల‌పై కేంద్రం పెత్త‌నం ఏంట‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ విష‌య‌మై సుప్రీంకోర్టు వ‌ర‌కూ వెళ్లి వెనుదిరిగారు అని కూడా ఇవాళ ఢిల్లీ కేంద్రంగా ఉన్న మీడియా వెల్ల‌డి చేస్తోంది. ఎగువ‌న ఉన్న తెలంగాణ నీటి వాటాలు జ‌ల విద్యుత్ కు సంబంధించిన ప‌నులు వీట‌న్నింటిపై త‌గాదాలు మానుకుని తోటి రాష్ట్రంతో మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకోవాల‌ని ప‌దే ప‌దే కేంద్ర వ‌ర్గాలు కూడా సూచిస్తున్నాయి. ఏపీ సీఎం జ‌గ‌న్ తో కూడా ఎంతో స‌ఖ్యంగా ఉండే కేసీఆర్ జ‌ల‌వివాదాల‌ను రాజ‌కీయంగా త‌న‌కు అనుగుణంగా మ‌లుచుకుని తీరాల‌ని భావిస్తున్నారు అన్న‌ది సుస్ప‌ష్టం.

ఇదే సంద‌ర్బంలో ఆంధ్రాకు సంబంధించి కృష్ణా జ‌లాల వినియోగానికి సంబంధించి ఓ రూట్ మ్యాప్ కూడా ఇస్తాన‌ని గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌క‌టించారు కూడా! ఇప్పుడు కొత్తగా ఆయ‌న వాద‌న‌లో మార్పు వ‌చ్చింది. ఆ మ‌ధ్య ఇరు రాష్ట్రాల‌కూ సంబంధించిన అపెక్స్ కౌన్సిల్ లో కూడా ! ఆంధ్రా క‌న్నా తెలంగాణ అధికారులే గ‌ట్టిగా త‌మ వాదం వినిపించారు.

దీంతో ఆ రోజు మీటింగ్ కూడా ఎటువంటి నిర్ణ‌యాల‌కు రాక‌పోయినా కృష్ణా జ‌లాల పంపిణీకి సంబంధించి ఇప్ప‌టికే సుప్రీం కోర్టును ఆశ్ర‌యించిన దాఖలు చేసిన పిటిష‌న్ ను మాత్రం తెలంగాణ వెన‌క్కు తీసుకుంది. ఆ మేరకు నాడు అపెక్స్ కౌన్సిల్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కానీ తెలంగాణ ప్ర‌తిపాద‌న‌ను మాత్రం కేంద్ర న్యాయ శాఖ ఒప్పుకునేందుకు సుముఖంగా లేదు.దీంతో మ‌రోసారి తెలంగాణ స‌ర్కారు సుప్రీం మెట్లెక్క‌డం ఖాయం అనే తెలుస్తోంది.