Begin typing your search above and press return to search.

ప్రోటోకాల్ పై కేంద్రం తప్పుచేసిందా ?

By:  Tupaki Desk   |   5 July 2022 4:00 AM GMT
ప్రోటోకాల్ పై కేంద్రం తప్పుచేసిందా ?
X
అసలు కన్నా కొసరే ఎక్కువైందన్నట్లుగా తయారైంది చివరకు. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం మోడీ భీమవరం వచ్చారు. హెలిపాడ్ దగ్గర మోడీని ఆహ్వానించటం, తర్వాత వేదికపైన మోడీతో పాటు కూర్చోవటంపై ఇపుడు వివాదం రాజుకుంది. తమను కార్యక్రమానికి పిలిచి అవమానించారంటు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గోల మొదలుపెట్టారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఈ కార్యక్రమం మొత్తాన్ని పర్యవేక్షించింది కేంద్ర పర్యాటక శాఖ. పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డే ప్రతిపక్షాలకు ఆహ్వానాలు పంపారు. కొందరితో నేరుగా ఫోన్లో కూడా మాట్లాడారు. అందరినీ హెలిపాడ్ దగ్గరకు, వేదిక దగ్గరకు రావాలని ఆహ్వానించింది కూడా కిషనే.

అయితే నరసాపురం ఎంపీ, అచ్చెన్నాయుడు కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఎంపీ విషయాన్ని పక్కనపెట్టేస్తే అచ్చెన్న విషయంలో మాత్రం పెద్ద తప్పే జరిగింది. కాకపోతే ఈ వియాన్ని అచ్చెన్న రాజకీయంగా వివాదం చేయటంకోసమే జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్నారు.

చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది కిషన్ శాఖనుండి. ఫోన్ చేసి మాట్లాడింది కూడా కిషనే. అలాంటపుడు ప్రధానమంత్రి ప్రోటోకాల్ ప్రకారం జాబితాలో ఎవరి పేర్లుండాలనే విషయాన్ని చూసుకోవాల్సింది కూడా కిషనే. ఏహోదా లేని చిరంజీవిని వేదికమీదకు తీసుకొచ్చిన కిషన్ రెడ్డి మరి అచ్చెన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు. జాబితాలో తన పేరు లేదన్న విషయాన్ని తెలుసుకున్న అచ్చెన్న మాట్లాడింది కూడా కిషన్ తోనే.

కార్యక్రమానికి అచ్చెన్న హాజరుకా లేకపోవటంలో తప్పంతా కిషన్ పైనే ఉంది. ఎందుకంటే ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కూడా అచ్చెన్న-కిషన్ మధ్య మాటలు నడుస్తూనే ఉన్నాయి. చివరి నిముషంలో కిషన్ కూడా స్పందించకపోవటంతోనే అచ్చెన్న కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. వాస్తవం ఇలాగుంటే అచ్చెన్న మాత్రం రాష్ట్రప్రభుత్వాన్ని తప్పుపట్టారు. దీనికి ఒక కారణం ఉంది.

కేంద్రం ఇచ్చిన జాబితాలో అచ్చెన్న పేరున్నా... రాష్ట్ర పోలీసులు రఘురామారజు, అచ్చెన్న పేరులను తీసేసి జాబితా రూపొందించుకున్నారు. కొత్త వారిని చేర్చే అధికారం రాష్ట్రానికి ఎస్పీజీ ఇవ్వదు. కానీ తీసేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేపనిగా అవమానించినట్టు తెదేపా ఆరోపిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే ఈ విషయంలో జగన్ జోక్యం చేసుకుని అచ్చెన్నను హెలిప్యాడ్, వేదిక దగ్గరకు వచ్చేలా చొరవ చూపుంటే బాగుండేది.