Begin typing your search above and press return to search.
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి
By: Tupaki Desk | 14 March 2022 4:30 AM GMTకెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఉదంతంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలు కాగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కెనాడలోని ఒంటారియా హైవే మీద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్యాసింజర్ వ్యాన్ ను ట్రాలీ ఢీ కొట్టిన వైనంలో వ్యాన్ లో ఉన్న ఐదుగురు భారతీయ విద్యార్థులు మరణించారు. మరో ఇద్దరు గాయాలైనట్లుగా చెబుతున్నారు.
మృతులను హర్‌ప్రీత్‌సింగ్, జస్పీందర్‌సింగ్, కరణ్‌పాల్‌సింగ్, మోహిత్ చౌహాన్, పవన్‌కుమార్ గా పోలీసులు గుర్తించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా కెనడాలోని భారత రాయబారి అజయ్ బిసారియా వెల్లడించారు. మరణించిన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లుగా ట్విటర్ లో తెలియజేశారు. బాధితుల స్నేహితులతో కాన్సులేట్ టీం సంప్రదింపులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ప్రమాదంలో మరణించిన ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతదేహాలను భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నత విద్య కోసం కెనడాకు వచ్చిన వారు.. ఇలా ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవటంతో ఆయా కుటుంబాల వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
విద్యార్థులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వ్యాన్ కెనడా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3.45 గంటల వేళలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.