Begin typing your search above and press return to search.

మనవడి పుట్టినరోజు చంద్రబాబు ఫ్యామిలీ చేసిన పనేంటో తెలుసా?

By:  Tupaki Desk   |   21 March 2022 8:30 AM GMT
మనవడి పుట్టినరోజు చంద్రబాబు ఫ్యామిలీ చేసిన పనేంటో తెలుసా?
X
టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు నాడు వీరి ఫ్యామిలీ భారీగా విరాళం అందజేసి ఆశ్చర్యపరిచింది. దేవాన్ష్ పుట్టినరోజు అయిన సోమవారం తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణకు ఏకంగా రూ.30లక్షల విరాళంగా చంద్రబాబు ఫ్యామిలీ అందజేసింది.

ఏటా దేవాన్ష్ పుట్టినరోజు అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇందుకు అయ్యే ఆ మొత్తం వ్యయాన్ని విరాళంగా టీటీడీకి ఇచ్చి చంద్రబాబు కుటుంబం ఆనవాయితీని ఇలా కొనసాగించింది.

ఈ క్రమంలోనే తమ విరాళంతో తిరుమల సందర్శకులకు ఈరోజు అన్న ప్రసాద వితరణ చేయాలని టీటీడీని చంద్రబాబు కుటుంబం కోరింది.

ఈ క్రమంలోనే తరిగొండ వెంగమాంబ నిత్యప్రసాద భవనంలో టుడే డోనర్ మాస్టర్ నారా దేవాన్ష్ అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది.

ఇక భక్తులు తమ కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే టీటీడీ అన్నప్రసాద వితరణకు ఇలా విరాళాలు ఇవ్వొచ్చు. అలాగే కొంత మంది భక్తులు తమ మొక్కులను కూడా ఇలానే చెల్లించుకుంటారు.

గతంలో చంద్రబాబు కుటుంబం స్వయంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంది. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన సత్రానికి విరాళం అందజేస్తోంది.