Begin typing your search above and press return to search.
నారాయణ.. నారాయణ.. కలిసివచ్చేవారేరి కామ్రెడ్..?
By: Tupaki Desk | 1 March 2022 2:30 PM GMTసీపీఐ నారాయణకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన చేసే వ్యాఖ్యలు.. పార్టీ లైన్‌కు అంటే. కమ్యూనిస్టులు ఏర్పాటు చేసుకున్న లక్ష్మణరేఖకు భిన్నంగా ఉంటాయి. ఆయన కూడా అలానే కావాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన అప్పుడప్పుడు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇవి కమ్యూనిస్టులకు నచ్చవని.. తన తోటి నాయకులు అసహ్యించుకుంటారని.. తెలిసినా.. నారాయణ .. నారాయణ అంటూ నెటిజన్ల నుంచి కూడా ఎద్దేవా వస్తుందని తెలిసినా.. కూడా నారాయణ ఏమాత్రం వెనక్కి జంకరు.
తాను అనుకున్నది మాట్లాడేస్తుంటారు. గత కొన్నాళ్లుగా ఆయన నాగార్జున ఆధ్వర్యంలో నడుస్తున్న బిగ్‌బాస్ షోపై తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇది పక్కా వ్యభిచార గృహమని అన్నారు. అప్పట్లోనే దీనిపై కోర్టులో కేసు వేశారు.
అయితే.. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి తీర్పు రాలేదు. అయితే..ఇంతలోనే.. నారాయణ మరోసారి విరుచుకుపడ్డారు. అన్నమయ్య, రామదాసు వంటివి గొప్ప చిత్రాల్లో నటించిన.. నాగార్జున ఇలాంటి బిగ్‌బాస్ షో ఎందుకు చేస్తున్నారని.. ప్రశ్నించారు. ఇది పక్కా బ్రతల్ హౌస్ అని మరోసారి మండిపడ్డారు.
దీనిని నిషేధించాలని.. నారాయణ డిమాండ్ చేశారు. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఒక్కరంటే ఒక్క కమ్యూనిస్టు నాయకుడు కూడా నారాయణకు కలిసి వచ్చిన వారు లేరు. పైగా.. ఆయన పక్షాన ఒక్కరు కూడా మద్దతు ఇచ్చింది కూడా. ఎందుకంటే.. కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఎలా ఉన్నా.. ప్రజలకు ఏం అవసరమో.. ఎలాంటివి అవసరమో వారు చూసుకుంటారు.
ఇష్టం లేని వారు టీవీలు ఆఫ్ చేస్తారు. అంతేకానీ.. ఆ సినిమాలో నటించారు.. ఈ సినిమాలో నటించారు కాబట్టి.. అసలు రియాల్టీ షోలే మానేయాలనడం.. మూర్ఖత్వం అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే నారాయణను వెనుకేసు కు వస్తే.. తమకు.. పార్టీకి కూడా ఇబ్బందేనని.. కమ్యూనిస్టులు గుర్తించి ఉంటారని అంటున్నారు పరిశీలకులు. అందుకే.. నారాయణ,నారాయణ అంటూ.. పక్కకు తప్పుకొంటున్నారు.