Begin typing your search above and press return to search.

దమ్మున్న లీగ్.. దుమ్ము రేపే బ్రాండ్ వ్యాల్యూ.. ఐపీఎల్

By:  Tupaki Desk   |   26 March 2022 10:32 AM GMT
దమ్మున్న లీగ్.. దుమ్ము రేపే బ్రాండ్ వ్యాల్యూ.. ఐపీఎల్
X
బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), గ్లోబల్ టి20 కెనడా (జీటి20సి) ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లీగ్ లు. కానీ, దేనికీ లేని క్రేజ్.. దేనికీ లేని ఆకర్షణ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సొంతం. ప్రపంచ క్రికెట్‌లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ ధనిక బోర్డుగా నిలవడానికి కారణం ఐపీఎల్. ఈ లీగ్ లో క్లిక్ అయి వారి వారి జాతీయ జట్టుకు ఎంపికయినవారు ఎందరో? ఉదాహరణకు వెంకటేశ్ అయ్యర్ నే చూడండి.. సరిగ్గా ఏడాది కిందట వరకు వెంకటేశ్ అంటే ఎవరికీ తెలియదు.

2021లో జరిగిన ఐపీఎల్ రెండో అంచెలో విధి లేని పరిస్థితుల్లో కోల్ కతా అతడిని ఓపెనర్ గా పంపింది. దానిని అందిపుచ్చకున్న అయ్యర్.. అదరగొట్టాడు. అటునుంచి అటు టీమిండియాకు ఎంపికయ్యాడు.ఇప్పుడు టీమిండియా టి20 ప్రపంచ కప్ ప్రణాళికల్లో ఉన్నాడు. అదీ.. ఐపీఎల్ కు ఉన్న క్రేజ్. ఇక ఈసారి ఐపీఎల్ రెండేళ్ల తర్వాత భారత్ లో జరుగనుంది. జట్ల సంఖ్య కూడా 8 నుంచి 10కి పెరిగింది. బ్రాండ్ విలువలోనూ ప్రపంచంలోని ఏ ఫ్రాంచైజీకి లేని ఘనత వీటి సొంతం. ఆ బ్రాండ్ వాల్యూ చూస్తే మైండ్ బ్లాంకే..

లక్నో టాప్.. గుజరాత్ సెకండ్

మొత్తం పది జట్లలో రూ.7 వేల కోట్లపైగా బ్రాండ్ విలువతో లక్నో సూపర్ జెయింట్స్ టాప్ లో ఉంది. తొలిసారి లీగ్ లో అడుగుపెడుతున్న ఈ జట్టుకు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. వాస్తవానికి ఇప్పుడే అరంగేట్రం చేస్తున్నది కాబట్టి దీని విలువతో మిగతా జట్లను పోల్చకూడదు. అయితే, మొత్తమ్మీద చూసినా.. ఈ జట్టుదే అత్యధిక బ్రాండ్ వాల్యూ. మరోవైపు రూ.5,600 కోట్ల బ్రాండ్ వాల్యూతో గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో ఉంది. అయితే, ఇదీ తొలిసారి బరిలో దిగుతున్న జట్టే.

వీటిని మిగతా జట్లతో ఎందుకు పోల్చలేమంటే.. అవన్నీ 14 సీజన్లుగా ఉన్నాయి. వందల కోట్ల స్థాయి నుంచి వచ్చాయి. తొలినాటి ధరనే ఇప్పుడూ వాటికి వర్తింపజేస్తే ఆ ఫ్రాంచైజీల ధరలు వీటికి సమానంగానే ఉంటాయి. ఉదాహరణకు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ ఫ్రాంచైజీ విలువ ప్రస్తుతం రూ.2.700 కోట్లు. పాత జట్లలో దీని ధరనే అధికం.

మరో వ్యాపార వేత్త శ్రీనివాసన్ కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ ధర రూ.రూ. 2,500 కోట్లు. లీగ్ లో అత్యంత విజయవంతమైన ఈ రెండు జట్ల ధర.. కొత్తగా రానున్నా రెండు జట్ల ధర కూడా తక్కువగా ఉండడం గమనార్హం. కానీ, ఐదుసార్లు విజేత ముంబై, నాలుగు సార్లు చాంపియన్ చెన్నైల విలువ ీ ప్రాతిపదికన వీటి విలువను తక్కువ అంచనా వేయలేం.

1. రాజస్థాన్ రాయల్స్ : ఐపీఎల్ లో అతి తక్కువ బ్రాండ్ వాల్యూ కలిగిన జట్టు రాజస్థానే.. ఐపీఎల్ తొలి ట్రోఫీ గెలవడం మినహా పెద్దగా సక్సెస్ కాలేదు. రాజస్థాన్ జట్టు బ్రాండ్ విలువ రూ. 249 కోట్లుగా ఉంది.

2. కింగ్స్ : ఐపీఎల్ ఇంతవరుకు టైటిల్ నెగ్గని జట్టు పంజాబ్ కింగ్స్. తమ ప్రదర్శన మాదిరిగానే ఆ జట్టు బ్రాండ్ వాల్యూ కూడా తక్కువే. లీగ్ స్టేజ్ కే పరిమితమైన ఈ జట్టు విలువ రూ. 318 కోట్లు.

3. ఢిల్లీ క్యాపిటల్స్ : ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీ నెగ్గని జట్లలో ఢిల్లీ కూడా ఉంది. 2020 లో రన్నరప్ గా నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. ఢిల్లీ బ్రాండ్ వాల్యూ రూ.370 కోట్లు.

4. సన్ రైజర్స్ హైదరాబాద్ : ఐపీఎల్ లో ఒక టైటిల్ కైవసం చేసుకున్న ఆరెంజ్ బ్రాండ్ వాల్యూ రూ. 442 కోట్లుగా ఉంది.

5. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : జట్టులో కింగులాంటి విరాట్ కోహ్లి తో పాటు స్టార్ ఆటగాళ్లు ఎందరున్నా బెంగళూరు కూడా ఇంతవరకు ట్రోఫీ నెగ్గలేదు. ఈ జట్టు బ్రాండ్ వాల్యూ రూ. 536 కోట్లు.

6. కోల్ కతా నైట్ రైడర్స్ : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అధినేతగా ఉన్న కేకేఆర్ బ్రాండ్ వాల్యూ రూ. 543 కోట్లు. ఈ ఫ్రాంచైజీ రెండు సార్లు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

7. చెన్నై సూపర్ కింగ్స్ : ఐపీఎల్ లో నాలుగు సార్లు విజేత, 9 సార్లు ఫైనలిస్టు అయిన సీఎస్కే బ్రాండ్ వాల్యూ రూ. 2,500 కోట్లు.. క్యాష్ రిచ్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నైకి పేరుంది.

8. ముంబై ఇండియన్స్ : ఇక, ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కు క్యాష్ రీచ్ లీగ్ లో తిరుగులేది. రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ బ్రాండ్ విలువ రూ. 2,700 కోట్లు. ఐపీఎల్ లో టాప్ బ్రాండ్ వాల్యూ ముంబైదే.

9. లక్నో సూపర్ జెయింట్స్ : ఇక, ఈ ఏడాది ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి లక్నో..గతేడాది వేలం ప్రక్రియలో సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఎల్ఎస్జీ.. రూ. 7,090 కోట్లతో ఫ్రాంచైజీని దక్కించుకుంది.

10. గుజరాత్ టైటాన్స్ : లక్నో మాదిరిగానే ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న గుజరాత్ టైటాన్స్ కూడా రూ. 5.625 కోట్లతో ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది.