Begin typing your search above and press return to search.
జగనన్న పథకాలు ఆగుతాయా ? బీ అలర్ట్
By: Tupaki Desk | 22 March 2022 7:30 AM GMTరానున్న రెండేళ్లే మనకు కీలకం అని జగన్ చెబుతున్నారు. కానీ ఆ విధంగా పథకాల అమలు జరిగేందుకు మంచి పేరు తెచ్చుకునేందుకు ఇవాళ అవకాశాలున్నాయా అన్న అనుమానాలు రేగుతున్నాయి.ఎందుకంటే అప్పులతో నెట్టుకువస్తున్న ఏపీకి కేంద్రం చేసే సాయం ఏమీ లేదు. అలా అని రాష్ట్ర సర్కారు ఖర్చులు తగ్గించుకుంటుందా అంటే అదీ లేదు. ఏదో ఒక విధంగా పీఆర్సీ తగాదాల నుంచి బయటపడినప్పటికీ, ఇంకొందరి కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఇవాళ్టికీ పెండింగ్ లోనే ఉన్నాయి అన్నది వాస్తవం.
జీతాల బకాయిలు తీర్చేందుకు కూడా హైకోర్టు డైరెక్షన్ ఇవ్వాలా ? అని విపక్షం ప్రశ్నిస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం లేదా అంటే ఉంది..అయినా కూడా ఆదాయానికి తగ్గ ఖర్చు అయితే లేదు. ఆదాయానికి మించిన వ్యయం అయితే లెక్కా పత్రం లేకుండానే ఉంది. పోనీ ఆదాయ వ్యయాలు అంచనా వేసి, నిర్థారణ చేసి అందుకు తగ్గ ప్రణాళికలను ఇప్పటికిప్పుడు జగన్ దగ్గర అధికారులు ఉంచగలరా అదీ లేదు.
అస్థిర ఆర్థిక వ్యవస్థ కారణంగా జగన్ ఇవాళ కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నది ఓ వాస్తవం.ఇదే సమయంలో పథకాలకు తగ్గ నిధులు లేవు. నెలకో పథకంలో భాగంగా మొన్ననే జగనన్న విద్యా దీవెనకు ఏడు వందల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. కానీ ఇదే సమయంలో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న వారికి ఫీజు రీ యింబర్స్మెంట్ నిధులు జమ కాలేదు. దీంతో వీరంతా గగ్గోలు పెడుతున్నారు. ఎయిడెడ్ మరియు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పటికీ ఓ క్లారిటీ లేదనే అంటోంది విపక్షం. మరోవైపు బకాయిల చెల్లింపుల్లోనూ పారదర్శకత లేదనే తేలిపోయింది. కొన్నింట ఆర్థిక భారం అనుకున్నవి ఇప్పుడిప్పుడే వదిలించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఆ విధంగా ఆయన మరో కొత్త వివాదంలోకి వెళ్తున్నారు.
ఇక జగన్ ప్రవేశ పెట్టిన మరో పథకం జల కళ కు సంబంధించి డిజిల్ రేట్లు అడ్డంకిగా ఉన్నాయి.పెరిగిన రేట్ల కారణంగా జల కళ పథకం అమలులో భాగంగా గ్రామాల్లో బోర్లు తవ్వేందుకు కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. నిబంధనల సాకుతో కాంట్రాక్టర్లు ముందుగానే చెల్లించే మొత్తాలు (ఈఎండీ)లో రెండు శాతం మినహాయించుకుని మిగతా మొత్తాన్ని వెనక్కు ఇస్తున్నారు అని, ఇదెంత మాత్రం తమకు కిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు.
దీంతో పలు జిల్లాలలో పనులు ఆగిపోతున్నాయి అని ప్రధాన మీడియా వెల్లడిస్తోంది. జలకళలో భాగంగా నాలుగేళ్ల వ్యవధిలో రైతుల భూముల్లో రెండు లక్షలకు పైగా బోర్లు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటిదాకా అంటే 2020 సెప్టెంబర్ నుంచి 10,533 బోర్లు మాత్రమే వేయగలిగారని ప్రధాన మీడియా చెబుతోంది.
ఉచిత బోర్లకు సంబంధించి రెండు లక్షలకు పైగా దరఖాస్తులు రైతుల నుంచి వచ్చాయని వీటిలో ఎక్కువ దరఖాస్తులు అనంతపురం నుంచి ఉన్నాయని కూడా ఆ కథనం చెబుతోంది. జగన్ సర్కారు చొరవ కొన్ని సార్లు బాగున్నా కొన్నింట పనులు పూర్తిగా ఆగి పోయాయి కూడా! పనులు ఆగిపోయిన జిల్లాలలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు ఉన్నాయని కూడా తెలుస్తోంది.
ఒక్క జలకళ అన్న పథకమే కాదు చాలా పథకాలకు నిధుల లోటు మరి కొద్ది రోజులలో పెరగనుంది. కానీ వాస్తవిక స్థితిగతులు అర్థం చేసుకోకుండా వైసీపీ మనుషులు మాట్లాడడమే అత్యంత హేయంగా ఉందని టీడీపీ అంటోంది.