Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ్యూహానికి ఆప్ అడ్డంకి ? అవునా ! నిజ‌మా !

By:  Tupaki Desk   |   21 March 2022 8:30 AM GMT
కేసీఆర్ వ్యూహానికి ఆప్ అడ్డంకి ? అవునా ! నిజ‌మా !
X
ఆమ్ ఆద్మీ పార్టీకి కేసీఆర్ కు మ‌ధ్య దూరం అయితే లేదు.వైరం కూడా లేదు. ఆ మాట‌కు వ‌స్తే వీలున్నంత వ‌ర‌కూ ఆప్ కు కేసీఆర్ కానీ జ‌గ‌న్ కానీ సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు అన్న‌ది నిజం..అని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో వినిపించే మాట. కానీ జాతీయ స్థాయి నాయ‌కుడిగా ఎద‌గాల‌ని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ కు కేజ్రీ ఓ అడ్డంకి ఆ మాట‌కు వ‌స్తే మోడీ ఓ అడ్డంకి..ఇంకా చెప్పాలంటే మోడీ క‌న్నా రేప‌టి వేళ ప్ర‌ధాని కావాలి అని క‌ల‌లుగంటున్న యోగి కూడా కేసీఆర్ కు ప్ర‌ధాన అడ్డంకిగా మారే అవకాశాలే పుష్క‌లం అన్న‌ది విప‌క్షాల ఉవాచ లేదా వారు చెబుతున్న మాట.

రెండు జాతీయ పార్టీల మ‌ధ్య ఎందుక‌నో న‌లిగి పోతున్నారు కేసీఆర్. తానొక ఉప ప్రాంతీయ పార్టీ నేత‌ను అన్న నిజాన్ని మ‌రిచి మ‌రీ! త‌నని తాను ఎక్కువ ఊహించుకుంటున్నారు కేసీఆర్. ఓ విధంగా ఆయ‌న‌కున్న అతి విశ్వాసం కార‌ణంగానే కొన్ని చోట్ల రావాల్సిన ఫ‌లితాలు రావడం లేద‌ని విప‌క్షాలు అంటున్నాయి.రాష్ట్రంలో బీజేపీ క‌న్నా రాష్ట్రంలో కాంగ్రెస్ క‌న్నా ఎన్నో రెట్లు బ‌ల‌మ‌యిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర స‌మితి ఇవాళ న‌డుస్తోంది.

సొంతంగా కొన్ని ఆస్తులు పోగేసుకుంది.త‌ద్వారా మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల మేరకు ఆస్తులున్న ఏకైక పార్టీగా రికార్డుల‌లో ఉంది. అయినా కూడా కేసీఆర్ జాతీయ స్థాయి నాయ‌కుడిగా అస్స‌లు ఎద‌గ‌లేక‌పోతున్నారు.గ‌తంలో ఎన్టీఆర్ కొంత, చంద్ర‌బాబు కొంత ఇదే త‌ర‌హా ప్ర‌య‌త్నాలు చేసి ఓడిపోయారు. కొంత‌లో కొంత వాజ్ పేయి హ‌యాంలో చంద్ర‌బాబు మాట నెగ్గింది.

ఆ రోజు గ్రామీణాభివృద్ధి శాఖ ను ఎర్ర‌న్నాయుడికి కేటాయించి మంచి ప్రాధాన్య‌మే ఇచ్చారు అప్ప‌టి ప్ర‌ధాని వాజ్ పేయి. అటుపై రాష్ట్ర‌ప‌తిగా క‌లాం ను ఎన్నిక చేయ‌డంలోనూ కాస్తో కూస్తో చంద్ర‌బాబు ప్రమేయం ఉంది. ఇప్పుడిదే ఫార్ములాను బీజేపీ రిపీట్ చేయాల‌నుకుంటోంది.ఆ రోజు క‌లాం ఎంపిక‌తో దేశ వ్యాప్తంగా ఏ విధంగా అయితే మంచి మ‌న్న‌న‌లు అందుకున్నారో ,అదే విధంగా మ‌ళ్లీ అదే ఫార్ములాను మ‌రో సారి రిపీట్ చేయ‌డానికి సిద్ధం అవుతోంది బీజేపీ. పైకి ఎన్ని మాట‌లు చెప్పినా కూడా కేసీఆర్ మద్ద‌తు మాత్రం బీజేపీకే ఉంటుంది.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వేళ ఇదే నిజం కానుంది కూడా! అయితే ఎన్డీఏ క‌న్నా యూపీఏకు కాస్తో కూస్తో విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ కు కార్పొరేట్ శ‌క్తుల అండ లేదు.క‌నుక కాంగ్రెస్ మాత్రం ఏం చేయ‌గ‌ల‌దు అందుకే ఒక‌వేళ త‌మ పార్టీకి చెందిన గులాం న‌బీ ఆజాద్ ను బీజేపీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే ఏమీ అన‌లేదు. పోటీకి మ‌రో అభ్య‌ర్థిని వెత‌కనూ లేదు.అదేవిధంగా కేసీఆర్ కూడా బీజేపీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించి త‌న ప‌రువు పోగొట్టుకోనూ లేరు.

పోనీ మైనార్టీ నేత‌ను కాద‌ని ద‌ళిత నాయ‌కుడు అయిన ద‌త్తాత్రేయ‌కు అవ‌కాశం వ‌రించినా ఇదే విధంగా కేసీఆర్ ఇరుక్కు పోక త‌ప్ప‌దు. ఆ విధంగా చూసుకున్నా కేసీఆర్ ఈ సారి కూడా జాతీయ నాయ‌కుల శ్రేణిలో స్థానం ద‌క్కించుకోలేక‌పోవ‌డం ఓ విధంగా తెలంగాణ రాష్ట్ర స‌మితికి నిరాశే! ఓ మీడియా భాష‌లో చెప్పాలంటే తెరాస .. నిరాశ అన్న‌వి ఇక‌పై కూడా ఢిల్లీ రాజ‌కీయాల్లో త‌ప్పేలా లేవు.