Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆశ‌లు గ‌ల్లంతే ! సో.. సో..గా..జీవితం

By:  Tupaki Desk   |   20 March 2022 12:30 PM GMT
కేసీఆర్ ఆశ‌లు గ‌ల్లంతే ! సో.. సో..గా..జీవితం
X
అనుకున్నామ‌ని జ‌ర‌గ‌వు అన్నీ..అనుకోలేదని ఆగ‌వు కొన్ని..ఆ విధంగా కేసీఆర్ ఇవాళ త‌గ్గిపోయారు.ఇంకా చెప్పాలంటే వ‌చ్చే ఎన్నిక‌లలో ద‌క్షిణ తెలంగాణ నుంచి రాజ‌కీయం న‌డిపి ఎప్ప‌టిలానే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి త‌నని తాను ప‌రిమితం చేసుకోనున్నారు.

ఈ పాటి దానికి ప్ర‌శాంత్ కిశోర్ ఎందుకు వ‌చ్చాడ‌ట ! అని చాలా మంది న‌వ్వుకుంటున్నారు.వంద కోట్ల ఫార్ములా అంటూ నిరుద్యోగుల‌కు ఉద్యోగాల పేరిట అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న‌లు చేయించింది ఎందుక‌ట‌? అని నోరెళ్ల‌బెడుతున్నారు విప‌క్ష పార్టీ స‌భ్యులు మ‌రియు స్వ‌ప‌క్షానికి చెందిన కొంద‌రు కూడా ! ఆఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగా త‌మ‌కు గెలుపు సాధ్యం కాద‌ని ఫిక్స్ అయిపోవ‌డం ఇవాళ కేసీఆర్ వంతు మ‌రియు కేటీఆర్ వంతు కూడా! బీజేపీపై అరుపులు కూడా ఓ నాల్రోజులు మాత్ర‌మే! ఆ త‌రువాత క‌థ కంచికి..కేసీఆర్ ఇంటికి..అని అంటున్నాయి విప‌క్షాలు.


జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ రాణించాల‌నుకున్నా కూడా కుద‌ర‌ని ప‌ని అని తేలిపోయింది.గ‌తం క‌న్నా భిన్నంగా ఇప్పుడు రాజ‌కీయం త‌యారైంది.రంగూ,రూపూ అన్నీ రోజురోజుకూ మారిపోతున్నాయి.ఈ క్ర‌మంలో చాలా చోట్ల కేసీఆర్ ఆశ‌లు గ‌ల్లంతు అయ్యేందుకు అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

ఎందుకంటే ఆయ‌న అనుకున్న విధంగా జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో పేరు తెచ్చుకోవ‌డం అంత సులువు కాదు.ఉత్త‌రాది నాయ‌కులకు చెల్లినంత‌గా ద‌క్షిణాది నాయ‌కులకు ఇలాంటివి చెల్ల‌వు అని ఇప్ప‌టికే నిరూప‌ణ అయింది.అందుకు కొన‌సాగింపుగానే ఇవాళ్టి ఫ‌లితాలు ఉన్నాయి.వ‌చ్చే కాలంలోనూ కేసీఆర్ మాత్ర‌మే సీఎంగా ఉంటారు. కేటీఆర్ మంత్రిగా ఉంటారు.అంటే మరో ఐదేళ్లు యువ రాజు ప‌ట్టాభిషేకం లేద‌న్న‌ది నిజం.

వాస్త‌వానికి ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక ముఖ్యంగా యూపీ,పంజాబ్ రాష్ట్రాల ఫ‌లితాల‌పై స్ప‌ష్ట‌త అనూహ్య రీతిలో పొందాక చాలా వ‌ర‌కూ కేసీఆర్ వెనుకంజ వేశారని చెప్పాలి. అదేవిధంగా ప్ర‌శాంత్ కిశోర్ లాంటి స్ట్రాట‌జిస్టులు ఉన్నా కూడా మోడీలాంటి బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఢీ కొన‌డం అంత సులువు కాదు.ఈ నేప‌థ్యంలో జాతీయ పార్టీ నెల‌కొల్పాలి అన్న క‌ల‌లు కూడా వ‌ద్ద‌నుకుంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగా దూసుకుపోయేంత శ‌క్తి ఇవాళ దేశ రాజ‌కీయాల్లో ఇత‌ర పార్టీల‌కు లేదు.

స్వ‌చ్ఛందంగా పార్టీల కోసం ప‌నిచేసే నాయ‌కులు కానీ కార్య‌క‌ర్త‌లు కానీ కొర‌వ‌డుతున్నారు.బాగా చదువుకున్న వారు పెద్ద‌గా ఇటుగా రావ‌డం లేదు.ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ప్ర‌యోగాలు చేశాక ద‌శాబ్ద కాలం పాటు అదే ప‌నిగా జ‌నంలో ఉంటూ పేరు తెచ్చుకున్నాక ఇవాళ పంజాబ్ ను కైవ‌సం చేసుకోగ‌లిగింది.అంత‌టి స్థాయిలో కేసీఆర్ పేరు తెచ్చుకోవాలంటే అది కుద‌ర‌ని ప‌ని.అందుకే ఆయ‌న జాతీయ పార్టీ పెట్టాల‌ని భావించినా కూడా ఇప్ప‌టి ప‌రిణామ క్ర‌మంలో సంబంధిత గతుల్లో వ‌ద్ద‌నే అనుకుంటున్నారు.