Begin typing your search above and press return to search.
చెప్పే దానితో పోలిస్తే చేసేది అస్సలు సింక్ కావట్లేదేం కేసీఆర్?
By: Tupaki Desk | 29 May 2022 7:30 AM GMTబంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ఎనిమిదేళ్ల క్రితం ఎన్నికల బరిలోకి దిగి.. అధికారాన్ని సొంతం చేసుకున్న ఆయన.. తన పదవీ కాలం పూర్తి కాక ముందే అప్రకటిత ముందస్తుకు వెళ్లిన వైనం తెలిసిందే. ఆయన వేసుకున్న ఎత్తులు ఫలించి.. చంద్రబాబు రూపంలో ఆయనకు అందిన వరం.. కేసీఆర్ ను రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించిందని చెప్పాలి. రెండో దఫా అధికారం చేపట్టిన మూడేళ్లకే ఆయనిప్పుడు రాష్ట్ర రాజకీయాలు కాదు.. దేశ రాజకీయాలే లక్ష్యంగా పని చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఆయన దేశాన్ని బాగు చేయాలని.. దుష్ట కాంగ్రెస్.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక కూటమిని ఏర్పాటు చేయాలని.. కలిసి వచ్చే పార్టీలన్నింటితో కలిపి కేంద్రంలో తాను చక్రం తిప్పాలని ఆశ పడుతున్న ఆయన.. ముందు నుంచి చెబుతున్న బంగారు తెలంగాణ కల గురించి మాత్రం అడిగే అవకాశాన్ని ఇవ్వట్లేదు. చిన్న గీతను మరింత చిన్నదిగా చేయటానికి పెద్ద గీత గీసే అలవాటున్న ఆయన.. ఇప్పుడు రాష్ట్రం కాదు తన లక్ష్యం జాతీయరాజకీయాలని దేశాన్ని మార్చేయాల్సిన అవసరం ఇప్పుడు అర్జెంట్ గా ఉందంటున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. పలు పార్టీ అధినేతలతో సమావేశం అవుతున్నారు. ఎప్పటికప్పుడు సానుకూలత వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నప్పటికి.. అనుకున్నంత ఎక్కువగా రెస్పాన్స్ రావట్లేదన్న మాట వినిపిస్తోంది.
ఈ కారణంతోనే ఆయన షెడ్యూళ్లు ఎప్పటికిప్పుడు మారిపోతున్నాయని చెబుతున్నారు. మోడీ రాష్ట్రానికి రావటానికి ముందు ఢిల్లీకి వెళ్లిన ఆయన.. అప్పటి నుంచి దాదాపు 15 రోజుల పాటు ఫుల్ బిజీ అని చెప్పేశారు. తీరా ప్రధాని మోడీ రాష్ట్రానికి రావటానికి రెండు రోజుల ముందు తెలంగాణకు వచ్చేసి.. సరిగ్గా ఆయన హైదరాబాద్ లో అడుగు పెట్టే సమయానికి బెంగళూరు వెళ్లిపోవటం తెలిసిందే.
హైదరాబాద్ నుంచి ప్రధాని మోడీ బయలుదేరిన గంటల వ్యవధిలో హైదరాబాద్ లో ల్యాండ్ అయిన ఆయన.. అంతకు ముందు చెప్పిన షెడ్యూళ్లను రద్దు చేసుకొని ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. నిజానికి ఇలా ముందుగా ప్రకటించిన షెడ్యూళ్లను అదే పనిగా రద్దు చేసుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. దీంతో.. ఆయన చెప్పే దానికి చేసే దానికి సంబంధం ఉండటం లేదంటున్నారు. దేశ పర్యటనను పది రోజులు కనీసం చేస్తారన్న సంకేతాలు ఇచ్చి.. రెండు రోజులకే తిరిగి వచ్చేసిన తీరుపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బెంగళూరు పర్యటన తర్వాత జార్ఖండ్.. రాలేగావ్ సిద్దిలలో కార్యక్రమాలు ఉంటాయని చెప్పి.. చివరకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చేశారు. ఇలా ఎప్పటికప్పుడు తన ప్రోగ్రాంలను ప్రకటించటం.. రద్దు చేయటం చూస్తుంటే.. పెద్ద సారు తెగ కన్ఫ్యూజన్ లో ఉన్నారా? లేదంటే.. ఆయన్ను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.