Begin typing your search above and press return to search.
మహానాడు వేదికగా.. క్లారిటీ లేని విషయాలు ఇవే..!
By: Tupaki Desk | 29 May 2022 1:30 PM GMTమహానాడు అదిరింది. మూడేళ్ల తర్వాత... నిర్వహించిన మహానాడులో కొత్త జోష్ కనిపించింది. నాయకు లు.. కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు.
అయితే.. ఇక్కడ మిస్సయిన అంశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. అత్యంత కీలకమైన విషయాలపై పార్టీ అధినేత చంద్ర బాబు క్లారిటీ ఇవ్వలేదనే అంశాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం.. బీసీ, ఎసీ, ఎస్టీ మైనార్టీలకు.. అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
మంత్రివర్గంలో అగ్రకుల ప్రాధాన్యం తగ్గించి.. ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యం పెంచింది. మరోవైపు సామాజిక కార్పొరేషన్లలోనూ.. మహిళలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇవన్నీ కూడా పైకి ప్రచారంలో లేవని టీడీపీ కానీ ఇతర పక్షాలు అనుకుంటే.. పొరపాటేనని పరిశీలకులు అంటున్నారు.
అండర్ కరెంట్‌గా ఆయా విషయాలపై చర్చ అయితే జరుగుతోంది. ఆయా సామాజిక వర్గాల్లో తమకు ఇప్పుడు పదవులు దక్కాయని.. ఆనందం కూడా ఉంది.
అయితే.. ఆర్థికంగా నే జగన్ ఇబ్బంది పడుతున్నారు. ఇది మినహా.. జగన్ చేసిన సామాజిక ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దానికి మంచి మార్కులే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకూడా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ సామాజిక వర్గాలకు ఇన్ని పదవులు ఇస్తానని.. ఈ సామాజిక వర్గాలను ఎలివేట్ చేస్తానని మహానాడు వేదికగా ప్రకటిస్తారని.. ఆయా వర్గాలు ఎదురుచూసిన మాట వాస్తవం. ఎందుకంటే.. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో మహానాడు నిర్వహించారు.
ఈ క్రమంలో సంచలనాలకు మహానాడును వేదికగా చేసుకుని చంద్రబాబు ప్రకటనలు చేస్తారని ఎదురు చూసింది వాస్తవమే. అయితే..అనుకున్న విధంగా చంద్రబాబు ఈ దిశగా ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు.
పైగా సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తానన్న మాట ఆయన చెప్పలేక పోయారు. పార్టీలో 40 శాతం పదువులు యువతకు ఇస్తానని చెప్పారే తప్ప.. వారిలో మహిళల కోటా ఎంత.. ? పురుషుల కోటా ఎంత? ఏయే సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తాను.. అనే విషయాలు వెల్లడించలేదు. ఇది ఇప్పుడు ఆయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా క్లారిటీ లేని మహానాడుగా మిగిలిపోయిందని అంటున్నారు.