Begin typing your search above and press return to search.
రాజకీయాలను వదిలినా వైరాగ్యాన్ని వదలరా...?
By: Tupaki Desk | 31 March 2022 10:34 AM GMTచిరంజీవి పేరుకు ముందు మెగాస్టార్ అని అంటేనే అందం. ఆయనకు కూడా ఆనందం. నిజంగా చూస్తే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన మగ మహారాజు. టాలీవుడ్ టాప్ చెయిర్ ఎపుడూ ఆయనదే. ఆయన సున్నిత హృదయుడు. అద్భుత కళాకారుడు. అందరివాడు. అలాంటి చిరంజీవి రాజకీయాలలోకి వెళ్లారు అంటేనే అంతా ఆశ్చర్యపోయారు. ఈ రోజుకీ ఆయన ఎవరినీ పరుషంగా మాట్లాడి ఎరుగరు.
అలాంటిది రాజకీయాల్లో నాలుగు అనాలి, పది పడాలి. నిజంగా చిరంజీవి మనసు ఎపుడూ సినిమాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి తప్పు చేశాను అని అనేక సార్లు అనుకున్నారేమో. అయితే అది ఎప్పటికి వదలని వైరాగ్యంగా మారిపోయింది.
ఇపుడు చూస్తే ఆయన సినిమాలు వరసబెట్టి చేస్తున్నారు. మళ్ళీ తన హవా చాటుకుంటున్నారు. కానీ రాజకీయాల విషయం వచ్చేసరికి మాత్రం ఆయన ఏదో రూపంలో విముఖత వ్యక్తం చేస్తూనే ఉన్నారు లేటెస్ట్ గా మెగాస్టార్ మిషన్ ఇమాప్జిబుల్ చిత్రం రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ మరోమారు రాజకీయాల ప్రసక్తి తీసుకువచ్చారు.
తాను ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళానా అని బాధపడ్డారు. ఈసారి బాధ ఏంటి అంటే అప్పట్లో అలా కనుక రాజకీయాల్లోకి వెళ్ళకపోయి ఉంటే హీరోయిన్ తాప్సీ తో నటించే వాడిని అన్నదన్న మాట. సరే కారణం ఏదైనా రాజకీయాలు అంటే చాలు మెగాస్టార్ మనసు మాత్రం ఎందుకొచ్చానా అని ఎపుడూ బాధగా మూలుగుతూనే ఉండడం విశేషం.
నిజానికి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి బాగానే ఓట్లూ సీట్లూ ఆ టైం లో సాధించారు. ఆ టైం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే అది ఒక వైపు వైఎస్సార్, మరో వైపు చంద్రబాబు ఉన్న కాలం. ఇంకో వైపు తెలంగాణా ఉద్యమం ఉంది. ఒక విధంగా చిరంజీవి లాంటి అందరి మనిషికి అది రాంగ్ టైం పొలిటికల్ ఎంట్రీ.
కానీ చిరంజీవి పార్టీ పెట్టారు. అంత పోటీలోనూ 18 సీట్లు సాధించారు. ఆ తరువాత కాంగ్రెస్ లో పార్టీని కలిపి కేంద్ర మంత్రి అయ్యారు. తన వంతు బాధ్యత అక్కడ నిర్వహించి ఏ మకిలీ అంటించుకోకుండా తిరిగి తనకు ఇష్టమైన సినీ రంగంలోకి వచ్చారు. అయినా కానీ రాజకీయం వదిలినా ఈ వైరాగ్యం మాత్రం ఆయనకు ఎప్పటికీ పోవడం లేదు అంటే ఆయనకు సినిమా మీద ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవాలి.