Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త జిల్లాలు.. అభ్యంతరాల లెక్క తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   10 March 2022 9:30 AM GMT
ఏపీలో కొత్త జిల్లాలు.. అభ్యంతరాల లెక్క తెలిస్తే అవాక్కే
X
ఏపీలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పెద్ద ఎత్తున అభ్యంతరాలు.. మార్పులు.. చేర్పులు.. సూచనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అనుసరించిన ఫార్ములా (ప్రతి లోక్ సభ నియోజకవర్గం ఒక జిల్లాగా మార్చటం) సరైనది కాదని.. దాని వల్ల ఎన్నో ప్రాక్టికల్ సమస్యలు ఎదురు కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

కొత్త జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకురావొచ్చు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఏపీ కొత్త జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలు ఏకంగా 12 వేల వరకు ఉన్నట్లుగా చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వేళ సిద్ధం చేసిన వెబ్ సైట్ లో ఈ ఫిర్యాదుల్ని అప్ లోడ్ చేశారు. మొత్తం 12 వేల అభ్యంతరాల్లో అత్యధికంగా ప్రకాశం.. నెల్లూరు.. చిత్తూరు.. కడప.. క్రిష్ణా.. జిల్లాల నుంచే వచ్చినట్లుగా చెబుతున్నారు. జిల్లాల వారీగా వచ్చిన అభ్యంతరాలుపై ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

ఫిబ్రవరి 15 నాటికి కొత్త జిల్లాలపై వచ్చిన అభ్యంతరాల్ని పరిశీలించి.. ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు వీలుగా నివేదికల్ని సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్లు.. .ఇతర రెవెన్యూ అధికారులు ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వీలు ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ అభ్యంతరాలపై అధికారులు ఇచ్చే నివేదికల్లో ఎన్ని అంశాల్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని తుది గెజిట్లు విడుదల కానున్నాయి.

మొత్తంగా వచ్చిన అభ్యంతరాల్ని కొన్ని విభాగాలుగా మారిస్తే.. అందులో ముఖ్యమైనవి.. కొత్త జిల్లాల డిమాండ్లు. ఇవే అత్యధికంగా వచ్చినట్లు చెబుతున్నారు. ముసాయిదాలో పేర్కొన్న హెడ్ క్వార్టర్లను కాకుండా కొత్త వాటిని ఏర్పాటు చేయాలంటూ విన్నపాలు.. మండలాల విలీనంపై డిమాండ్లు పెద్ద ఎత్తున వస్తున్నట్లు చెబుతున్నారు. ఇవి కాకుండా.. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు.. జిల్లాల పేర్ల మీద పలు సలహాలు.. సూచనలు వచ్చినట్లుగా చెబుతున్నారు.

కొత్త జిల్లాలల విషయంలో మదనపల్లె.. రాజంపేట.. మార్కాపురం.. హిందూపురం పేరుతో కొత్త జిల్లాల డిమాండ్ల పేరు వచ్చాయి. ఒక్కో డిమాండ్ మీదన సగటున 150 విన్నపాలు వచ్చాయని.. అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా నిర్ణయించటాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనట్లుగా చెబుతున్నారు. రాజంపేట హెడ్ క్వార్టర్ గా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. మరి.. ఈ డిమాండ్లలో ఎన్నింటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.