Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో దారుణం: 12 గంటల్లో 12 మంది పసి ప్రాణాలు శివైక్యం?
By: Tupaki Desk | 3 March 2022 4:33 AM GMTశివరాత్రి పండుగ పన్నెండు మంది చిన్నారుల ప్రాణాల్ని బలి తీసుకుందా? అంటే అవునని చెబుతున్నారు. పండుగ వేళ ఉద్యోగానికి ఏం వెళతామని భావించారేమో కానీ.. సిబ్బంది భారీ ఎత్తున సెలవులు తీసుకోవటం.. అత్యవసర వైద్య విభాగంలో వైద్య సేవలు అందుబాటులోకి ఉండాల్సిన వేళ.. అలాంటిదేమీ లేకపోవటంతో కేవలం 12 గంటల వ్యవధిలో 12 మంది చిన్నారులు ప్రాణాలు వదిలిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో చిన్నపిల్లల పెద్దాసుపత్రిగా పేరున్న నీలోఫర్ ఆసుపత్రిలో 12 మంది చిన్నారులు మరణించిన వైనం షాకింగ్ గా మారింది. అధికారిక వర్గాలు మాత్రం కేవలం ఇద్దరు మాత్రమే మరణించినట్లు చెబుతున్నా.. వాస్తవం మాత్రం మరోలా ఉందని చెబుతున్నారు.
ఒక ప్రముఖ మీడియా సంస్థలో ప్రచురితమైన కథనం ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా ఉండటమే కాదు.. ఇంత భారీగా పసిపిల్లల ప్రాణాలు పోవటమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సాధారణంగా తెలంగాణ వ్యాప్తంగా క్రిటికల్ ఆరోగ్య పరిస్థితుల్లో ఉండే చిన్నారులకు వైద్యం అందించేందుకు నిలోఫర్ ఆసుపత్రికి తీసుకొస్తారు. ఈ కారణంగా ఈ ఆసుపత్రిలో రోజువారీ సగటు మరణాలు రేటు మిగిలిన ఆసుపత్రులతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుందని చెబుతారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రోజువారీగా రెండు నుంచి ఐదు వరకు చిన్నారుల మరణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే.. శివరాత్రి సందర్భంగా అత్యవసర వైద్య సేవలు అందించే విభాగంలో సిబ్బంది పెద్ద ఎత్తున సెలవులు పెట్టటం.. ఉండాల్సిన సిబ్బందిలో అత్యంత తక్కువ మంది విధులకు హాజరు కావటంతో.. చిన్నారులకు అందాల్సిన వైద్యం అందలేకపోయింది దీంతో.. శివరాత్రి పండుగ రోజు (మంగళవారం) సాయంత్రం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు అంటే.. 12 గంటల్లో ఏకంగా పన్నెండు మంది పసి ప్రాణాలు గాల్లో కలిసిపోవటం గమనార్హం.
అధికారికంగా మాత్రం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు పోయాయని.. వారికి తుదికంటా వైద్య సేవల్ని అందించామని.. కానీ వారిని కాపాడలేకపోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నా.. వాస్తవం మాత్రం వేరుగా ఉందని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి 35 మంది పేషెంట్ కేర్ సిబ్బంది హాజరుకావాల్సి ఉండగా.. నలుగురు మాత్రం విధులకు హాజరైనట్లుగా తెలుస్తోంది.
300 పడకలు ఉన్న ఇన్షోసెస్ లోని ఈఎస్ఆర్.. ఎన్ఐసీయూ వార్డుల్లో కేవలం ఇద్దరు నర్సులు మాత్రమే డ్యూటీకి హాజరైనట్లుగా తెలుస్తోంది. దీంతో..ఆయాల చేత ఇంజక్షన్ లు ఇప్పించినట్లుగా చెబుతున్నారు. 12 మంది చిన్నారుల మరణాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. పన్నెండు మంది చిన్నారులు మరణించినట్లుగా మాత్రం అధికారులు ఎక్కడా మాట్లాడటం లేదు. మరి.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.