Begin typing your search above and press return to search.

పోటెత్తారు.. ఓటేస్తారా.. జ‌న‌సేనానీ?!

By:  Tupaki Desk   |   19 July 2022 2:30 AM GMT
పోటెత్తారు.. ఓటేస్తారా.. జ‌న‌సేనానీ?!
X
సేమ్ సీన్‌.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌కు ఎలాంటి ఆద‌ర‌ణ ఉందో.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను చూసేందుకు యువ‌త ఎలా అయితే.. పోటెత్తారో.. ఇప్పుడు కూడా అంతే ఆద‌ర‌ణ‌. అలానే యువ‌త పోటెత్తుతున్నారు. ఆయ‌న స‌భ పెడుతున్న ర‌హ‌దారులు కిలోమీట‌ర్ల కొద్దీ నిండిపోతున్నాయి. గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. ఇస‌కేస్తే రాల‌నంత‌గా ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. సీఎం ప‌వ‌న్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ స‌భ‌ల‌కు యువ‌త పోటెత్తార‌నే చెప్పాలి.

అయితే.. వీరు ఓటేస్తారా? ప‌వ‌న్ స‌భ‌ల‌కు వ‌స్తున్న యువ‌త‌.. ఆయ‌నను.. ఆయ‌న పార్టీని గెలిపిస్తారా? లేక‌.. కేవ‌లం త‌మ అభిమాన హీరోను చూసేందుకు మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తారా? ఇదీ..ఇ ప్పుడు రాజ‌కీ య విశ్లేష‌కుల చ‌ర్చ‌. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలలో.. రాజ‌కీయ మార్పు గోదావరి జిల్లాలతోనే మొదలవ్వాల‌ని పేర్కొన్నారు. దీంతో యువ‌త రెచ్చిపోయి మ‌రీ చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగించారు.

అయితే.. గోదావరి జిల్లాలు ప్రత్యేకించి ఒక సామాజిక వర్గానికి పెట్టని కోటలా వున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగాలలో సామాజిక అంశం ప్రస్తావన లేకపోయినప్పటికీ గోదావరి జిల్లాల పైనే జనసేన పార్టీ అధికంగా దృష్టిం సారించినట్టు తెలుస్తోంది. ఈ విధమైన ముద్ర ఏ రాజకీయ పార్టీకీ లేదు.

ఎందుకంటే ఆ పార్టీ తనకు తానుగానే ఒక సామాజిక చట్రంలో బందీ అయ్యే పరిస్తితి ఉత్పన్నం అవుతుంది. జనసేనాని ఆ దృక్పథం లేకపోయినప్పటికీ ప్రత్యర్ధులు దానిని ఆసరాగా తీసుకొని జనసేన పార్టీ పై సామాజిక ముద్ర వేసేందుకు ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న జనసేనాని సంకల్పం, అందుకోసం ఆయన పడుతున్న శ్రమ వంటివి బాగానే ఉన్నా.. ఇప్ప‌టికీ.. ఆయ‌న ఒక సామాజిక వ‌ర్గం కోణంలోనే చూస్తుండ‌డం అధికార పార్టీ నాయ‌కులు కూడా ఆయ‌న‌ను ఒక వ‌ర్గానికి ప‌రిమితం చేయ‌డం.. వంటివి ఇబ్బందిగానే ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే యువ‌త, ప్ర‌జ‌లు ఆయ‌న స‌భ‌ల‌కు త‌ర‌లివ‌స్తున్నా.. ఆయ‌న విజ‌యం ద‌క్కించుకుంటారా? వీరి ఓట్ల‌ను అనుకూలంగా మార్చుకుంటారా? అనేది ప్ర‌శ్న‌గా మారింది.