Begin typing your search above and press return to search.
హోటళ్లు.. రెస్టారెంట్లకు వెళుతుంటారా? చదవటం అస్సలు మిస్ కావొద్దు
By: Tupaki Desk | 4 July 2022 11:55 PM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో హోటళ్లు.. రెస్టారెంట్లకు వెళ్లని వారు అస్సలంటే అస్సలు ఉండరు. రెగ్యులర్ గా కాకున్నా.. వారంలో ఒకట్రెండు సార్లు వెళ్లేటోళ్లు చాలాఎక్కువ మందే ఉంటారు.
నెల తిరిగేసరికి.. ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా రెస్టారెంట్ కు వెళ్లని వారే ఉండని పరిస్థితి. అలాంటి వారందరికి తీపికబురు చెప్పింది కేంద్ర వినియోగదారు హక్కుల పరిరక్షణ సంస్థ. హోటళ్లు.. రెస్టారెంట్లు ఎప్పటి పరిస్థితుల్లో సర్వీస్ టాక్స్ ను వసూలు చేయకుండా బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఒకవేళ ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘించినట్లు గుర్తిస్తే తమకు కంప్లైంట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. బిల్లుపై సర్వీస్ ట్యాక్స్ పేరుతో పది శాతం కలిపి.. ఆ మొత్తంపై జీఎస్టీ వసూలు చేస్తున్న ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర వినియోగదారు హక్కుల పరిరక్షణ సంస్థ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంది. బిల్లులో సర్వీస్ ట్యాక్స్ ను కలపకూడదని.. మరే పేరుతోనూ ఈ రుసుమును వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.
ఏదైనా హోటల్ లేదంటే రెస్టారెంట్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తే.. దానిని బిల్లు నుంచి తీసేయాలని వినియోగదారులు అడగొచ్చని పేర్కొంది. అంతేకాదు.. ఇలాంటి అనుభవం ఎక్కడైనా ఎదురైతే.. 1915కు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చని.. లేదంటే జాతీయ వినియోగదారుల మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేసింది.
ఇలాంటి ఫిర్యాదులను పరిష్కరించేందుకు e-daakhil పేరుతో పోర్టల్ ను అందుబాటులో ఉంచారు. సో.. హోటల్.. రెస్టారెంట్లకు వెళ్లే వారు ఎవరైనా సరే.. సర్వీస్ ట్యాక్స్ ను కానీ అందులో పేర్కొంటే.. మీ హక్కులకు భంగం వాటిల్లినట్లు.. మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.