Begin typing your search above and press return to search.
కొత్త ప్రచారం: ఆర్ఆర్ఆర్ 2 టికెట్లకు.. వచ్చే వస్తువుల లెక్క విన్నారా?
By: Tupaki Desk | 23 March 2022 4:10 AM GMTఇప్పటివరకు ఎప్పుడూ జరగనంత భారీగా ఒక సినిమా మీద చర్చ జరుగుతోంది. గడిచిన కొన్నేళ్లుగా ఈ క్రేజీ మూవీ మీద సాగుతున్న డిస్కషన్ లెక్క ఒక ఎత్తు అయితే.. సినిమా విడుదల వేళలో.. ఆ సినిమా టికెట్ల ధరల మీద ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. తెలుగు సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత భారీగా టికెట్ల ధరల్ని నిర్ణయించటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా టికెట్ ధర మరీ కారుచౌకగా లేకుండా అదే సమయంలో భారీ షాకిచ్చేలా ఉండకుండా అందరికి అందుబాటులో.. సినిమా ప్రేక్షకుడికి సౌకర్యవంతంగా ఉంటే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.
పేద.. సామాన్యులు ఎక్కువగా వెళ్లే నేల.. తర్వాతి తరగతికి టికెట్ ధర రూ.200లకు పైనే డిసైడ్ చేస్తే.. సగటు జీవి సినిమాకు వెళ్లేదెలా? అన్నది ప్రశ్న. ఆ మాటకు వస్తే సామాన్యుడికి మాత్రమే కాదు.. మధ్యతరగతి జీవి సైతం ఆర్ఆర్ఆర్ టికెట్ ధర విన్నంతనే ఉలిక్కిపడేలా ఉండటమే కాదు.. మరీ ఇంత ఎక్కువగా ఉండటమా? అని ఫీల్ అయ్యే పరిస్థితి.
మల్టీఫ్లెక్సుల్లో నిర్ణయించిన టికెట్ల ధరల్ని చూస్తే.. 2డీ మూవీ టికెట్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే దగ్గర దగ్గర రూ.500 వరకు ఉంటోంది. అంతే.. రెండు టికెట్ల కోసం అక్షరాల వెయ్యి ఖర్చు చేయాల్సిందే. ఇదే వెయ్యి రూపాయిలు పెడితే.. ఇంటికి వస్తే వస్తువులతో కూడిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టికెట్ ధరను ఈ కోణంలో చేూపించి.. దాని లెక్కను చూసినప్పుడు.. నిజమే కదా? అనిపించక మానదు.
2 ఆర్ఆర్ఆర్ టికెట్లు వర్సెస్ ఇంటికి అవసరమైన వస్తువులు చూస్తే..
బియ్యం 5 కేజీలు రూ.210
గోధుమ పిండి కేజీ రూ.40
సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.180
ఉప్మా రవ్వ కేజీ రూ.40
ఉల్లిపాయలు 2 కేజీలు రూ.50
గుడ్లు ఒక డజను రూ.40
పంచదార కేజీ రూ.40
కందిపప్పు కేజీ రూ.120
సంతూర్ సబ్బులు 2 రూ.60
రిన్ పౌడర్ కేజీ రూ.90
టీ పొడి పావు కేజీ రూ120
పసుపు 200గ్రాములు రూ.40
కారం 200గ్రాములు రూ.60
ఇన్ని సరుకులు కలిపితే అయ్యే మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.1090. హోల్ సేల్ లో వీటి ధరలు మరింత తక్కువగా ఉంటాయి. అంటే.. రెండు ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లతో ఒక కుటుంబానికి వచ్చే వస్తువులు ఇన్ని. ఈ లెక్క వేసుకుంటున్న వారు.. ఇంత ఖరీదైన సినిమాను చూడాల్సిన అవసరం ఉందా? అన్న మాట వినిపిస్తోంది.